విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో వైఎస్సార్ కాపు నేస్తం పథకంలో కొత్తగా వచ్చిన ధరఖాస్తులలో 3వేలు మంది అర్హతగలిగిన వారిగా గుర్తించామని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు ఓబిసి వెల్ఫెర్ ప్రిన్సిపల్ సెక్రటరి జి జయలక్ష్మికి వివరించారు. వైఎస్సార్ కాపు నేస్తం పథకం పై ఓబిసి వెల్ఫెర్ ప్రిన్సిపల్ సెక్రటరి జి జయలక్ష్మి తమ కార్యాయలం నుండి అన్ని జిల్లా కలెక్టర్లతో గురువారం జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలోని కలెక్టర్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు జూమ్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా 3,403 ధరఖాస్తులు వచ్చాయని వీటిని పరిశీలించి 3వేల ధరఖాస్తులను అర్హత కలిగిన వాటిగా గుర్తించామని, అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికి కాపు నేస్తం పథకాన్ని లబ్ది చేకూర్చేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ డిల్లీరావు ఓబిసి వెల్ఫెర్ ప్రిన్సిపల్ సెక్రటరి జి జయలక్ష్మికి వివరించారు. జూమ్ కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ఎస్ నూపూర్ అజయ్ ఉన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …