రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందన కార్యక్రమం లో నగరపాలక సంస్థ పరిధిలో 22 ఫిర్యాదులు అందాయని నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ పి.వి. సత్యావేణి తెలియచేశారు. సోమవారం స్థానిక మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం లో ముఖ్య టౌన్ ప్లానింగ్ అధికారి సురేష్ కుమార్ తో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా పి.వి.సత్యవేణి మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ వారం ప్రజల నుంచి 22 ఫిర్యాదులు అందాయని తెలిపారు. స్పందన కార్యక్రమం లో ఎమ్ హెచ్ వో డా.వినూత్న, ఇంజనీరింగ్ ఇతర అధికారులు, వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Tags rajamendri
Check Also
ఈ నెల 11న జరగబోయే ఓబన్న జయంతి ఉత్సవాలను ఘనంగా జరిపించాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బీసీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సంఘం కర్నూలు వారి, వడ్డెర సంక్షేమ సంఘం …