స్పందనలో వచ్చిన అర్జీలను నిర్ణీత కాలవ్యవధిలొనే పరిష్కరించాలి…

-స్పందనకు ప్రజలనుంచి విశేష స్పందన
-ఈరోజు స్పందనలో 850 ఫిర్యాదులు అందాయి..
-ప్రతి ఫిర్యాదు పై తీసుకున్న చర్య పై సమీక్ష నిర్వహిస్తాం..
-కలెక్టర్ డా. కే.మాధవీలత

కోరుకొండ, నేటి పత్రిక ప్రజావార్త :
పరిపాలన వికేంద్రీకరణ లో భాగంగా ఏర్పాటైన నూతన జిల్లాల యంత్రాంగం ప్రజలతో మమేకమైయ్యే దిశలో ప్రజల దగ్గరికే వచ్చి స్పందన కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం రాజానగరం నియోజకవర్గంలోని కోరుకొండ లో శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రైవేటు ఫంక్షన్ హాల్లో శాసన సభ్యులు కలెక్టర్ మాధవీలత, జక్కంపూడి రాజా , జాయింట్ కలెక్టర్ సిహెచ్ . శ్రీధర్,జిల్లా అధికారులతో కలిసి స్పందన అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ డా. కె. మాధవీలత మాట్లాడుతూ ఈరోజు స్పందనలో పెన్షన్, భూసమస్యలు , ఇరిగేషన్ సంబంధించిన పలు అంశాలపై ఫిర్యాదులను అందచేశారని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన తరువాత బొమ్మురు లోని కలెక్టరేట్ నందు స్పందన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. గతంలో తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి డివిజన్ వారు కాకినాడ లోనూ, కొవ్వూరు డివిజన్ పరిధిలోని వారు ఏలూరు కలెక్టరేట్ నందు ఫిర్యాదులు అందచేసే వారన్నారు. కొత్త జిల్లా ఏర్పాటు చేసిన తరువాత ఒక వారం జిల్లా కలెక్టరేట్ నందు, ఒక వారం నియోజక వర్గంలో ను స్పందన నిర్వహించాలని నిర్ణయించామన్నారు . కోరుకొండ మండలంలో పెన్షన్, భూ సమస్యలు, ప్రవేటు సంస్థలకు భూములు ఇచ్చిన రైతుల కు రావలసిన బకాయి లు కోసం ఫిర్యాదు లు ఇచ్చారని తెలిపారు. మొత్తం 850 కి పైగా స్పందన ఫిర్యాదులు అందాయని, వాటిని ఆన్లైన్ లో నమోదు చేస్తున్నామని అన్నారు. జిల్లాలో ఇటీవల వరదలు వలన ముంపు ప్రాంతాలలో ఉన్న 1100 పైగా కుటుంబాలకు ముఖ్యమంత్రి ఆదేశాలు మేరకు రూ.2 వేలు ఆర్థిక సహాయం, 25 కేజీ లు బియ్యం, పామ్ ఆయిల్, కందిపప్పు, పంచదార, కూరగాయలు అందించడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలకి ఏదైనా సమస్య వస్తే ప్రజల వద్దకే వెళ్లి ఆ సమస్య పరిష్కారం చూపాలన్నది రాష్ట్రముఖ్యమంత్రి వై ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆలోచన అని శాసనసభ్యులు జక్కంపూడి రాజా అన్నారు. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. రాజకీయాలకు, కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ప్రజా సమస్యలను పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు. పరిపాలన వికేంద్రీకరణ లో భాగంగా నూతన జిల్లాలు ఏర్పాటు చేశారన్నారు. స్పందనలో వొచ్చిన ప్రతి ఒక్క ఫిర్యాదు పరిష్కారం కోసం కలెక్టర్ బృందం నిబద్దతతో పనిచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

స్పందనలో వచ్చిన అర్జీల్లో కొన్ని…
కోరుకొండ మండలంకు పశ్చిమ గొన గూడెంకు చెందిన ఎర్ర సత్యవతి తమ అర్జీలు 2000 సంవత్సరంలో ప్రభుత్వం తనకు 207 /1బిలో ప్లాట్ నెంబర్ 76 తో ఇళ్ల పట్టాను అందించగా 2005లో ఆ స్థలాన్ని మెరక చేయించుకున్నానని ఇటీవలి ఉపాధి పనులు కొరకు వేరే గ్రామం వెళ్లడంతో ఇతరులు ప్రభుత్వం అందించిన నా భూమిని ఆక్రమించారని కావున అధికారులు నా భూమిని నా గుర్తించవలసిందిగా అర్జీలు కోరారు.

రాజమహేంద్రవరం రూరల్ మండలం కొంతమూరు గ్రామంలోని ప్రకాష్ ఎంప్లాయిస్ కాలనీకీ మూడు ప్రధాన రహదారులు అనుసంధానంగా ఉన్నాయని ఈ రహదారులు వెంబడి నిత్యం ఆటోలు, కార్లు, బస్సులుతో ట్రాఫిక్ ఉంటుందని డ్రైనేజీ లేకపోవడం కారణంగా చిన్న పాటి వర్షానికే
ఈ కాలనీ రోడ్లపైకి మురుగునీరు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కావున అధికారులు మురుగు నీరు పారుదలయ్యేలా డ్రైనేజీ లను నిర్మించాలని కొంతమూరుకు చెందిన జె.బి. గంగాధరరావు అర్జీలో పేర్కొన్నారు.

కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామానికి చెందిన కొత్తపల్లి సీతానాథ్ తమ అర్జీలో తమ తండ్రిగారు హనుమంతరావు ఆస్తి (వ్యవసాయ భూమి) భూమికి సంబంధించి నాకు చందవలసిన భూమి వేరొకరు పేరున పట్టా పాస్ పుస్తకం జారీ చేసి ఉన్నారని, కావున అధికారులు పరిశీలించి మా తండ్రిగారు నాకిచ్చిన భూమికి పట్టాదారు పాస్ పుస్తకం అందించి పరిష్కరించవలసిందిగా అర్జీలో కోరారు.

ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు, డిఆర్వో బి.సుబ్బారావు, ఆర్డీఓ ఏ.చైతన్యవర్శిని, ఆర్డబ్ల్యూ ఎస్ ఇంజినీరింగ్ అధికారి డి.బాలశంకర రావు, డిప్యూటీ డైరెక్టర్ గ్రౌండ్ వాటర్ పీఎస్ విజయకుమార్, జెడి మత్స్యాశాఖ ఈ.కృష్ణారావు, డీఎస్ఓ పి.ప్రసాదరావు, జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఎస్.మాధవరావు, జిల్లా హౌసింగ్ అధికారి బి.తారచంద్, జీఎం పరిశ్రమలు బి.వెంకటేశ్వర రావు, డిఎస్ఓ ప్రసాదరావు, డిఎహెచ్ఓ , డీఈవో అబ్రహం,కోరుకొండ తాహసిల్దారు, ఎంపిడీవో వైయస్సార్ ఆర్ సి పి సిజిసి ప్రతినిధి జక్కంపూడి విజయలక్ష్మి, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *