Breaking News

జలజీవన్‌ మిషన్‌ ద్వారా రూ.84 కోట్లతో చేపట్టిన 432 పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకోండి..

-జిల్లాలో రక్షిత మంచినీటి పథకాలకు రూ.244 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు
-ప్రతి ఇంటికి ట్యాప్‌ (కుళాయి) కనెక్షన్‌ ఇవ్వాలన్న లక్ష్యాన్ని పూర్తి చేయండి
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జలజీవన్‌ మిషన్‌ ద్వారా ఇంటింటికి కుళాయి కనెక్షన్‌ ఇవ్వడంతోపాటు రక్షత మంచినీటిని సరఫరా చేసేందుకు ఇప్పటివరకు రూ. 84 కోట్లతో మంజూరైన 432 పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని రక్షిత మంచినీటి పథకాలకు మరో 244 కోట్ల రూపాయలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నామని కలెక్టర్‌ ఎన్‌. డిల్లీరావు తెలిపారు.
జలజీవన్‌ మిషన్‌ ద్వారా ఇంటింటికి ట్యాప్‌ కనెక్షన్‌, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌ల నిర్మాణాలు, జగనన్న కాలనీలలో నీటి సరఫరా పై జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు మంగళవారం ఆయన కార్యాలయంలో గ్రామీణ నీటి సరఫరా అధికారులు, ఇఓపిఆర్‌డిలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జలజీవన్‌ మిషన్‌ పథకం ద్వారా పక్షనల్‌ హౌసోల్డ్‌ ట్యాప్‌ కనెక్షన్‌ ఇచ్చేందుకు 84 కోట్ల రూపాయలతో 432 పనులు మంజూరయ్యాయన్నారు. మరో 244 కోట్ల రూపాయల అంచనాలతో పనులు చేపట్టేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాంమన్నారు. ఇందులో 38 కోట్ల రూపాయలు ఏ కొండూరు మండలం తండాలకు కృష్ణాజలాలను సరఫరా చేయనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. 5 లక్షల లోపు పనులను పంచాయతీ స్థాయిలో 5 లక్షల నుండి 40 లక్షల లోపు పనులను ఎగ్జికూటివ్‌ ఇంజనీరింగ్‌ స్థాయిలో 40 లక్షల నుండి 2 కోట్ల రూపాయల విలువగల పనులకు సూపరింటెండెంట్‌ స్థాయిలోను ఆ పైన పనులకు ఛీప్‌ ఇంజనీయర్‌ స్థాయిలోను అనుమతులు ఇవ్వవలసి ఉంటుందన్నారు. పంచాయతీ స్థాయిలో 5 లక్షల రూపాయల లోపు చేపట్టిన 184 పనులకు గాను ఇప్పటివరకు 90 పనులు పూర్తి చేయడం జరిగిందని మిగిలిన వాటికి సంబంధించి జగ్గయ్యపేట మండలంలో 7, వత్సవాయి మండలంలో 14, కంచికచర్ల మండలంలో 17, నందిగామ మండలంలో 5, వీరులపాడు మండలంలో 16 పనులను ఆయా మండలాలకు చెందిన ఇఓపిఆర్‌డిలు పంచాయతీల ద్వారా ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులకు తక్షణమే పనులు అప్పగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 40 లక్షల లోపు చేపట్టవలసిన 77 పనులకు గాను 4 పనులను చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు వచ్చారని 53 పనులకు టెండర్లను పిలవవలసి ఉందని, రూ.40 లక్షలపై బడిన 17 పనులలో ఒక పని చేపట్టడం జరిగిందని నాలుగు పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు వచ్చారని మరో 12 పనులు 2 కోట్ల రూపాయల అంచనాలకు పై బడిన మరో 5 పనులు టెండర్లు దశలో ఉన్నాయని కలెక్టర్‌ తెలిపారు. 5 లక్షల రూపాయల అంచనాలకు పైబడిన పనులను మండల ప్యాకేజి కిందకు తీసుకురావాలన్నారు. ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ స్థాయిలో చేపట్టవలసిన పనులను ఆగస్టు 15 తేదిలోపు ఛీప్‌ ఇంజనీర్‌ స్థాయిలో చేపట్టవలసిన పనులకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేసి ఆగస్టు 31వ తేదీ లోపల ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే మండల ప్యాకేజి కింద జగ్గయ్యపేట తిరువూరు మండలాలలో పనులను చేపట్టడం జరిగిందని నందిగామ మైలవరం మండలాలకు సంబంధించిన పనులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జగనన్న జలజీవన్‌ మిషన్‌ ద్వారా జగనన్న కాలనీలలో నీటి సరఫరా సదుపాయం కల్పించేందుకు చేపట్టిన పనులను వేగవంతం చేయాలన్నారు సుమారు 135 కోట్ల రూపాయలతో 446 పనులను పూర్తి చేసి 80 వేల పక్షనల్‌ హౌసోల్డ్‌ ట్యాప్‌ కనెక్షన్‌లు ఇవ్వవలసి ఉందన్నారు. ఇప్పటివరకు నాల్గోవంతు పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. వీరులపాడు మండలం గూడెంమాదవరం, జి.కొండూరు మండలం కవులూరు, ఇబ్రహీంపట్నం మండలం దాములూరు, మైలవరం మండలం అయ్యప్ప నగర్‌ విజయవాడ రూరల్‌ మండలంలోని 5 లేఅవుట్లలో జలజీవన్‌ మిషన్‌ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. శాశ్వత ప్రతిపధికన చేపట్టేపనులకు త్వరితగతిన టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. కమ్యూనిటీ శానిటరీ కాంపెక్స్‌ల నిర్మాణంలో భాగంగా జిల్లాలోని 16 మండలాలో జరుగుతున్న పనులను కలెక్టర్‌ సమీక్షించారు. జిల్లాకు మంజూరైన 273 కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌ల నిర్మాణంలో భాగంగా బిలో బేస్మెంట్‌ స్థాయిలో ఉన్న 113 నిర్మాణాలకు మార్కింగ్‌, అవసరమైన మెటిరియల్‌ను సిద్దం చేయడం, ఎర్త్‌ వర్క్‌ తదితర పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు కార్యచరణ ప్రణాళిక రూపొందించుకొని అమలు చేయాలన్నారు. నిర్మాణ పనులను యంపిడివోలు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఇలు, పంచాయతీరాజ్‌ ఇఓపిఆర్‌డిలు సమన్వయం చేసుకుని పూర్తి చేయాలని కలెక్టర్‌ డిల్లీరావు అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ఇ ఎన్‌వి సత్యనారాయణ, ఇఇ డిఆర్‌ఎల్‌ ప్రసాద్‌, జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం డిప్యూటి ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు కె.రవికుమార్‌, వి. సత్యనారాయణ, కె. దయనంద్‌ జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన అసిస్టెంట్‌ ఇంజనీర్లు, ఇఓపిఆర్‌డిలు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రయాణ సమయంలో ప్రయాణికులకు అసౌకర్యం కల్పించిన వారి పై చట్ట రీత్యా కఠిన చర్యలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సంక్రాంతి పండుగ సందర్భంగా గురువారం రాజమహేంద్రవరం జిల్లా రవాణా అధికారి వారి కార్యాలయంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *