విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నేను ఐదేళ్లల్లో అభివృద్ధి ఏమిటో చేసి చూపిస్తా…నాకు చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ లు శత్రువులు కాదు. చంద్రబాబు, జగన్, నేను ముగ్గురం ఒకే వేదిక పై చర్చ కు సిద్దం అని ప్రజా శాంతి పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ కె.ఏ.పాల్ అన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో మంగళవారం మీట్ ది ప్రెస్ లో మాట్లాడుతూ దేశంలో, తెలుగు రాష్ట్రాలలో ప్రజాస్వామ్యం అనేది లేకుండా పాలన చేస్తున్నారని రాబోవు ఎన్నికల్లో వారికి తగిన బుద్ది చెప్పి తనకు అవకాశం ఇస్తే దేశాన్ని ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల భవిష్యత్తును ఉజ్వలంగా మారుస్తానని స్పష్టం చేశారు. ప్రజా స్వామ్యం చనిపోతుందని గతంలోనే చెప్పా అన్నారు. గతంలో న్యాయ వ్యవస్థపై నలుగురు న్యాయమూర్తులు బయటకి వచ్చి మాట్లాడారు అంటే మన న్యాయవ్యస్థను కూడా వారు ఎంతగా ప్రభావితం చేశారో అర్ధఅవుతుందన్నారు. మన పాలకులు న్యాయ మూర్తులను బెదిరించే స్థాయికి వచ్చారన్నారు. ఈవిఎం లు ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే మరలా బిజెపి అత్యధిక స్థానాలు పొంది అధికారంలోకి వస్తుందన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలి. అంటే గతంలో ఉన్న మాదిరిగా బ్యాలెట్ విధానంలో ఎన్నికలు పెట్టాలన్నారు. అలాగే కమ్యూనిస్టు లు అంటే నాకు ప్రత్యేకమైన గౌరవం ఉందన్నారు. వాళ్ళ సిద్ధాంతాలు ఎంతో గొప్పవి ప్రజలకు ప్రయోజనం ఉంది వాళ్ళకు అధికారం ఇవ్వకపోవటం దుర్మార్గం అన్నారు. 2014 ఎన్నికల్లో ప్రజా శాంతి పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అందుకోసం పాల్ రావాలి… పాలన మారాలి అనే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ బూత్ కమిటీలు అయ్యే వరకు అన్ని జిల్లాల్లో తిరుగుతూ బలోపేతం చేస్తున్నా అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు అధ్యక్షత వహించగా ఐజేయూ ఉపాధ్యక్షులు ఆంజనేయులు, ఏపీయూ డబ్ల్యూజే అర్బన్ యూనియన్ అధ్యక్షులు చావా రవి, కార్యదర్శి కొండా రాజేశ్వరరావు, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర ఉపాధ్యక్షులు కె జయరాజ్, కార్యదర్శి ఆర్ వసంత్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రయాణ సమయంలో ప్రయాణికులకు అసౌకర్యం కల్పించిన వారి పై చట్ట రీత్యా కఠిన చర్యలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సంక్రాంతి పండుగ సందర్భంగా గురువారం రాజమహేంద్రవరం జిల్లా రవాణా అధికారి వారి కార్యాలయంలో …