-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, రాజీవ్ గాంధీ పార్క్ ఆధునీకరణ పనులను పరిశీలించి చేపట్టిన ఆధునీకరణ పనులు అన్నియు వేగవంతము చేసి సత్వరమే పూర్తి చేయునట్లుగా చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులను ఆదేశించారు. పార్క్ నందలి ప్రధాన ద్వారం ఆధునీకరణ పనుల యొక్క పురోగతిని పరిశీలిస్తూ, వారం రోజులలో పార్క్ ఎంట్రన్స్ గేటు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అదే విధంగా పార్క్ నందలి మిగిలిన పనులను కూడా సత్వరమే పూర్తి చేసేలా చూడాలని అన్నారు. తదుపరి కృష్ణలంక 20వ డివిజన్ పరిధిలోని సర్వీస్ రోడ్ నందు జాతీయ రహదారి నుండి వర్షపు నీరు రావటం వల్ల ప్రజలకు ఎదురౌతున్న ఇబ్బందులకు పరిష్కరించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తూ, జాతీయ రహదారి నుండి వచ్చు వర్షపు నీరు అంతయు సర్వీస్ రోడ్ పై రాకుండా పైపులను ఏర్పాటు చేసి వాటి ద్వారా వర్షపు నీరు అంతయు డ్రెయిన్ లలోకి చేరునట్లుగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పర్యటనలో ఎగ్జీక్యూటివ్ ఇంజనీర్ ఏ.ఎస్.ఎన్ ప్రసాద్ మరియు పార్క్ సిబ్బంది పాల్గొన్నారు.