జిల్లాలో వై ఎస్ ఆర్ కాపు నేస్తం కింద 3 వ విడతగా 29,824 మంది లబ్ధిదారులకు చేయూత

-ఒక్కొక్కరికీ రూ. 15 వేలు చొప్పున రూ.44.73 కోట్లు పంపిణీ
-జిల్లా కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో వై ఎస్ ఆర్ కాపు నేస్తం కింద 29,824 మంది కాపు మహిళల బ్యాంకు ఖాతాలకు రూ.44.73 కోట్లు జమచెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వై ఎస్ ఆర్ కాపు నేస్తం 3 వ విడత కార్యక్రమంలో రూడా చైర్ పర్సన్ ఎమ్. షర్మిలా రెడ్డి తో కలిసి రూ.44.73 కోట్ల చెక్కును లబ్ధిదారులకు అంద చేశారు . ఈ సందర్భంగా కలెక్టర్ కె.మాధవిలత మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడానికి ఆర్థిక సాధికారిక దిశగా అడుగులు వేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద కాపు మహిళలకి వైయస్సార్ కాపు నేస్తం ద్వారా 45 – 60 సంవత్సరాలు మధ్య ఉన్న కాపు మహిళలకు రూ.15000 చొప్పున నగదును బ్యాంకు ఖాతాలకు జమచేసారని తెలిపారు. మహిళలు వారి కాళ్ళ పై వాళ్ళు నిలదొక్కు కోవడానికి ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి బ్యాంకు చేయడం జరిగిందన్నారు. ఈ మొత్తంతో వారు ఆర్థిక వనరులను పెంపొందించే విధంగా వీటిని వినియోగించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. నేరుగా నగదు బదలీ విధానంలో బ్యాంకు ఖాతాలకు జమ చేశారన్నారు. ముఖ్యమంత్రి కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో ఈ కార్యక్రమం లో పాల్గొన్నారని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలో కాపునేస్తం పథకం కింద ప్రయోజనం పొందిన మహిళలకు తొలుత ఆమె శుభాకాంక్షలు తెలియచేశారు. ఇంకా అర్హులు ఎవరికైనా ఈ పథకం అమలుకాక పోయిఉంటే సాంకేతికమైన కారణాల వలన ఆధార్ లింక్, బ్యాంకు ఖాతా తదితర కారణాలు దృష్ట్యా తిరిగి దరఖాస్తు చేసుకునే వెసులు బాటు కల్పించడం జరిగిందన్నారు. వాటిని త్వరితగతిన పరిష్కరించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

తూర్పు గోదావరి జిల్లాలో నియోజక వర్గాల వారీగా :
రాజమహేంద్రవరం రూరల్ 4685 మంది లబ్ధిదారలకు రూ.7,02,75,000 లు, రాజమహేంద్రవరం అర్బన్ 2038 మందికి రూ.3,05,70, 000 ; అనపర్తి 4283 మందికి రూ.6,52,45,000 ; రాజానగరం 6834 రూ.10,25,10,000 ; కొవ్వూరు 3976 మందికి రూ.5,96,40,000 ; నిడదవోలు 5299 మంది కి రూ. 7,94,85,000 ; గోపాలపురం 3387 మందికి రూ.5,08,05,000 లు

తొలుత గొల్లప్రోలు లో ముఖ్యమంత్రి పాల్గొన్న కార్యక్రమాన్ని ఆన్లైన్ లో జిల్లా అధికారులు లబ్దిదారులతో కలిసి వీక్షించారు. ఈ కార్యక్రమంలో రూడా చైర్ పర్సన్ మెడపాటి షర్మిలా రెడ్డి, జిల్లా బిసి సంక్షేమ అధికారి పి ఎస్ రమేష్, డిపివో జెవి సత్యనారాయణ, డి డి వో రత్న కుమారి, కొండగుంటురు సర్పంచ్ వి. నాగరాజు, లబ్దిదారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *