విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైద్య ఆరోగ్యశాఖలో సంస్కరణల లో భాగంగా ప్రభుత్వం గతంలో మంజూరు చేసిన జివో 143 పై ఉద్యోగుల సర్దుబాటు చేసేటటువంటి తరుణంలో వైద్యులు, పారామెడికల్, ఇతర సిబ్బంది పై తీసుకుంటున్న నిర్ణయాలపై తేది 1-8-2022 న సంఘాలతో చర్చించడానికి ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖలో అన్ని క్యాడర్ సంఘాలు డాక్టర్ సంఘాలు, సిహెచ్ఓ, ఎంపిహెచ్ఇఓ, హెచ్ఈఓ,పి.హెచ్.యన్, ఎంపిహెచ్ఎస్,(మేల్) యం.పి.హెచ్ యస్(ఫిమేల్) హెల్త్ విజిటర్స్, ఏఎన్ యం, ట్యూటర్లు, ఇలా అనేక క్యాడర్ వారి సంఘాల ఉన్నప్పటికీ కొన్ని సంఘాలనే ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించటం ఇతర క్యాడర్ సంఘాలను చర్చలకు ఆహ్వానించక పోవడం అభ్యంతరకరం అని, వైద్య ఆరోగ్య శాఖ లోని అన్ని డిపార్ట్ మెంట్ సంఘాలతో చర్చించి జరగబోయే సంస్కరణలో, సర్దుబాటులపై ప్రభుత్వం పునరాలోచిన చేయాలని అప్పుడు మాత్రమే అన్ని క్యాడర్ ఉద్యోగుల వెతలు తీరి ఇబ్బందులు లేకుండా ఉంటాయని, వైద్య ఆరోగ్య ప్రజారోగ్య శాఖ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ మరియు వైద్య విధానం పరిషత్ ఇలా అనేక శాఖల్లో ఉద్యోగులు ఉన్నారని వారిని కూడా చర్చలు ఆహ్వానించి విస్తృతంగా చర్చించి నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగులకు ఇబ్బందులు ఉండవని,అయితే చర్చలకు ఇప్పుడు ఆహ్వానింపబడ్డ సంఘాల వల్ల ఉద్యోగులకు ఒరిగేదేమీ ఉండదని, కేవలం వారి ఉనికి కోసమే మాట్లాడుతుంటారని వీరి వల్ల వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులకు ఒరిగేది ఏం లేదని ఉద్యోగులకు ఏ ఇబ్బంది జరిగినా చర్చలకు వెళ్లే నాయకులే నైతిక బాధ్యత వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ అమరావతి రాష్ట్ర అధ్యక్షులు వినుకొండ రాజారావు నేడు ఒంగోలులో విలేకరులతో మాట్లాడుతూ వైద్య, ఆరోగ్య శాఖ లోని అన్ని కేడర్ సంఘాలను చర్చ లకు ఆహ్వనించాలని డిమాండ్ చేశారు.
Tags vijayawada
Check Also
ముఖ్యమంత్రి పర్యటనలో జిఎంసి నుండి చేపట్టాల్సిన పారిశుద్యం, ప్యాచ్ వర్క్ లను పూర్తి చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : చేబ్రోలు హనుమయ్య కంపెనీ ప్రాంగణంలో శుక్రవారం జరిగే నారెడ్కో ప్రాపర్టీ షో ప్రారంభోత్సవ …