-జిల్లా కలెక్టర్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ప్రభుత్వ ప్రధాన్యత భవన నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు పనుల ప్రగతి పై సమీక్షించి త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ డిల్లీరావు రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరి గోపాల కృష్ణ ద్వివేదికి వివరించారు.
ప్రభుత్వ ప్రధాన్యత భవన నిర్మాణాలు, జలజీవన్ మిషన్, ఉపాధి హామి పనుల ప్రగతి, జగనన్న స్వచ్ఛసంకల్పం తదితర అంశాల పై రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరి గోపాల కృష్ణ ద్వివేది, పంచాయతీ రాజ్ కమీషనర్ కోన శశిధర్‌లు గురువారం జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.
కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన రైతుభరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ వంటి ప్రభుత్వ ప్రధాన్యత భవన నిర్మాణాల ప్రగతి, జగనన్న స్వచ్ఛసంకల్పం, ఉపాధి హామి పనులు, జలజీవన్ మిషన్ పనుల ప్రగతిని వివరించారు. పనుల ప్రగతిపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. మండలాభివృద్ధి అధికారులకు పనుల భాధ్యతలను అప్పగించడం జరిగిందని భవన నిర్మాణాలలో ఎదురయ్యే సమస్యలను తక్షణమే పరిష్కరించి నిర్మాణాలను వేగవంతం చేస్తున్నామన్నారు. జిల్లాలో 268 గ్రామ సచివాలయ భవనాలకు గాను 141 భవన నిర్మాణాలను పూర్తి చేయడం జరిగిందన్నారు. 260 రైతు భరోసా కేంద్రాలకు గాను 72 భవన నిర్మాణాలను పూర్తి చేశామని, 239 వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లగాను 49 భవన నిర్మాణాలను పూర్తి చేయడం జరిగిందని కలెక్టర్ వివరించారు. మిగిలినవి వివిధ దశలలో ఉన్నాయన్నారు. వివిధ సిమ్మెంట్ కంపెనీలకు 2,682 బస్తాల సిమ్మెంట్‌కు ఇండెంట్ పంపగా 2,425 బస్తాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ప్రతీ 15 రోజులకు 80 భవనాలను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామన్నారు. వర్షా భావ పరిస్థితుల వలన నిర్మాణాలలో కొంత ఆలస్యం జరిగిందన్నారు. కొన్ని భవనాలకు స్థల సమస్యలు ఎదురవగా వాటిని పరిష్కరిస్తున్నామని కలెక్టర్ వివరించారు. భవన నిర్మాణాలను ప్రారంభించి పనులు వేగవంతం చేసేందుకు నియోజకవర్గ స్థాయిలో స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ప్రణాళిక బద్దంగా భవన నిర్మాణాలను ినిర్ణీత గడువులోగా పూర్తి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డిల్లీరావు రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరి గోపాల కృష్ణ ద్వివేదికి వివరించారు.
వీడియోకాన్ఫరెన్స్‌లో డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ జె. సునీత, పంచాయతీరాజ్ ఇఇ ఏ వెంకటేశ్వరరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఇ ఎన్ వి సత్యనారాయణ, సంబంధిత అధికారులు ఉన్నారు.