ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాలను స్థానిక ప్రజా ప్రతినిధులు సహకారంతో పూర్తి చేయండి…

-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాకు మంజూరైన ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాలు స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అధికారులను ఆదేశించారు.
జగ్గయ్యపేట నియోజకవర్గానికి మంజూరైన ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాలపై పెనుగంచిప్రోలు రాధకృష్ణా ఫంక్షన్‌ హాల్‌లో శుక్రవారం జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు ప్రభుత్వ విప్‌, స్థానిక శాసన సభ్యులు సామినేని ఉదయభాను స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
సమావేశంలో జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలోని జగ్గయ్యపేట నియోజకవర్గానికి గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, హెల్త్‌ క్లినిక్‌ల భవనాలను నిర్మించాలని ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. వారంలోగా నియోజకవర్గ పరిధిలో ఇంకనూ ప్రారంభం కాని భవన నిర్మాణాలను ప్రారంభించాలని, ప్రారంభమై బిలో బేస్మెంట్‌ స్థాయిలో ఉన్న నిర్మాణాలను బేస్మెంట్‌ స్థాయికి తీసుకురావాలని అధికారులు, ఏజెన్సీలను కలెక్టర్‌ డిల్లీరావు ఆదేశించారు. జగ్గయ్యపెట నియోజకవర్గానికి మంజూరైన భవనాలలో ఇంకనూ ప్రారంభం కానివి, ప్రారంభమై బిలో బేస్మెంట్‌ స్థాయిలో ఉన్నవి మొత్తంగా 50 భవనాలు ఉన్నాయని వీటిలో ఇంకనూ ప్రారంభం కానివి 24 భవనాలను, బిలో బేస్మెంట్‌ స్థాయిలో ఉన్న 26 భవన నిర్మాణాలను త్వరితగతిన ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ భవనాల నిర్మాణ దశలో క్షేత్రస్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులను సంబంధిత మండల అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువచ్చి సమన్వయంతో పరిష్కరించు కోవాలన్నారు. భవన నిర్మాణాలకు అవసరమైన స్థల సేకరణలో ఎదురయ్యే ఇబ్బందులను రెవెన్యూ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ నిర్మాణాల ప్రగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారన్నారు. నిర్మాణాలకు అవసరమైన నిధులను ప్రభుత్వం ఎప్పటికప్పుడు మంజూరు చేస్తుందన్నారు. వారం రోజులలో ప్రారంభం కాని భవనాలను ప్రారంభింపచేసేలా అధికారులు, ఏజెన్సీలు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ డిల్లీరావు ఆదేశించారు. అభివృద్ధి పనులకు సంబంధించి ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలను కలెక్టర్‌ డిల్లీరావు తెలుసుకున్నారు
ప్రభుత్వ విప్‌ శాసనసభ్యులు సామినేని ఉదయభాను మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధి పనుల్లో జగ్గయ్యపేట నియోజకవర్గం అన్ని స్థాయిలో ముందంజలో ఉందన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ జిల్లాల పునర్విభజన వల్ల పాలన ప్రజలకు మరింత చేరువ అయిందన్నారు. ప్రజా ప్రతినిధులు అధికారులకు సహకరించి సమిష్టితో భవన నిర్మాణాలను పూర్తి చేసేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. జగనన్న కాలనీల ఇళ్ళకు ప్రభుత్వం పెండిరగ్‌ లేకుండా బిల్లులను వెంటనే మంజూరు చేస్తుందని శాసనసభ్యులు అన్నారు. అభివృద్ధి పనులు చేస్తున్న వారికి అధికారులు పరిపూర్ణ సహకారాన్ని అందించాలని కోరారు. ఏసమస్య ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని ప్రజా ప్రతినిధులకు శాసనసభ్యులు సూచించారు. పెండిరగులో ఉన్న అన్ని భవన నిర్మాణ పనులు తక్షణమే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటానని ప్రభుత్వ విప్‌ శాసనసభ్యులు సామినేని ఉదయభాను అన్నారు.
సమావేశంలో పెనుగంచిప్రోలు సర్పంచ్‌ వి. పద్మకుమారి, కెడిసిసి డైరెక్టర్‌ కె. రవిశంకర్‌, స్టేస్‌ మైనింగ్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ బి రామారావు, పూసల కార్పొరేషన్‌ డైరెక్టర్‌ సిహెచ్‌ కుమారి, పంచాయతీ రాజ్‌ ఎస్‌ ఇ అక్కినేని వెంకటేశ్వరరావు, జడ్పిటిసిలు వి.నాగమణి, ఏ. దేవమణి, ఎంపిపిలు యం. గాంధీ, యం. వెంకటేశ్వరరావు, నియోజకవర్గ మండల పరిధిలోని తహాశీల్థార్లు, యంపిడివోలు, స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *