విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్ళ కాలంలోనే ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా దాదాపు 90శాతం పైగా హామీలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దే అని ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. సోమవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 6వ డివిజన్,38వ సచివాలయ పరిధిలోని చలసాని వారి వీధి,గంగానమ్మ వారి వీధి, మరియు గుమ్మడి వారి వారి వీధి ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం తరపున వారికి అందిస్తున్న సంక్షేమ పథకాలు గురించి, చేస్తున్న అభివృద్ధి గురుంచి వివరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల సత్వర పరిష్కారానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మన తూర్పు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిరాటంకంగా జరుగుతుంది అని,ప్రజలు హారతులు పడుతూ మా వైస్సార్సీపీ నాయకులకు ఘన స్వాగతం పలుకుంతుంటే వారు ప్రభుత్వపాలన పట్ల ఎంత సంతోషంగా ఉన్నారు అనేది అర్ధమవుతుంది అని అన్నారు.గత తెలుగుదేశం ప్రభుత్వం లో ఎన్నిసార్లు మొరపెట్టుకున్న స్థానిక ఎమ్మెల్యే మా సమస్యల పట్ల స్పందించేవారు కాదని అసలు టీడీపీ నాయకులు ఎవరు మా కొండప్రాంతవాసుల దగ్గరకు వచ్చేవారు కాదని,మా ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి అభివృద్ధి లేకుండా చేసారని స్థానిక ప్రజలు విమర్శిస్తున్నారు అని అన్నారు.గతంలో ఇళ్ళు మంజూరు చేయాలన్న,పెన్షన్లు ఇవ్వాలన్న అర్హత ఉన్న సరే జన్మభూమి కమిటీలకు లంచాలు ఇస్తే తప్ప వచ్చే పరిస్థితి లేదని విమర్శించారు.ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రాజకీయ మనుగడ కోసం ప్రచార యావాతో రోజు పేపర్లో పడాలి అనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం మీద విమర్శలు చేయడం సిగ్గుచేటు అని,ఉద్యోగ కల్పన గురుంచి మాట్లాడుతున్న మీరు మీ టీడీపీ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని,జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యాక ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో చూసుకోవాలి అని సవాల్ విసిరారు.గతంలో ఇళ్ళు మంజూరు చేయాలన్న,పెన్షన్లు ఇవ్వాలన్న అర్హత ఉన్న సరే జన్మభూమి కమిటీలకు లంచాలు ఇస్తే తప్ప వచ్చే పరిస్థితి లేదని విమర్శించారు.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వలంటీర్, సచివాలయ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలు మా ఇంటి వద్దకే వస్తున్నాయి అని,కొండ ప్రాంతంలో నివసించే మాకు వైస్సార్సీపీ కార్పొరేటర్ ఆధ్వర్యంలో కొత్త మెట్ల మార్గాలు,మంచినీటి వసతి ,డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణలు చేపట్టడం జరిగిందని,గత తెలుగుదేశం ప్రభుత్వం లో ఎన్నిసార్లు మొరపెట్టుకున్న స్థానిక ఎమ్మెల్యే మా సమస్యల పట్ల స్పందించేవారు కాదని అసలు టీడీపీ నాయకులు ఎవరు మా కొండప్రాంతవాసుల దగ్గరకు వచ్చేవారు కాదని,మా ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి అభివృద్ధి లేకుండా చేసారని స్థానిక ప్రజలు విమర్శిస్తున్నారు అని అన్నారు. కానీ నేడు అర్హత ఉంటే చాలు కులమత పార్టీలకతీతంగా ఇంటి వద్దకే పెన్షను,రేషన్ సరకులు,సంక్షేమ పథకాలు అందిస్తున్నామని,ఎన్నికలు ఎప్పుడూ వచ్చిన ప్రజలు మరలా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తంచేశారు.గడప గడప కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది,మున్సిపల్ సిబ్బంది,విద్యుత్ సిబ్బంది అందరు పాల్గొని ఎవరికైనా ఏ ఇబ్బంది ఉన్న వెంటనే పరిష్కారం అయ్యేలా చేస్తున్నాం టీడీపీ నాయకులు ఇకనైనా అసత్య ప్రచారాలు, షో డ్రామాలు కట్టిపెట్టి ప్రజల కోసం పనిచేయాలని హితవు పలికారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,స్థానిక డివిజన్ కార్పొరేటర్,స్టాండింగ్ కమిటీ మెంబెర్ వియ్యపు అమర్నాద్,రాష్ట్ర తూర్పు కార్పొరేషన్ వెల్ఫేర్ డైరక్టర్ ఇజ్జాడ తేజేష్,వైస్సార్సీపీ నాయకులు అబ్బినాయుడు,హరీష్,కోటేశ్వర రావు,బుడ్డి,యోనా రాజు, బాలస్వామి, నత్తా ప్రవీణ్,రత్నరాజు,శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …