విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మొహర్రం సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గంలోని ముస్లీం సోదర సోదరీమణులకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు శుభాకాంక్షలు తెలిపారు. ముహమ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ త్యాగాన్ని మొహర్రం గుర్తు చేస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మొహర్రంను స్ఫూర్తిగా తీసుకుని ఇస్లాంకు మూలమైన త్యాగానికి, మానవతావాదానికి పునరంకితమవుదామని తన సందేశంలో కోరారు. ముస్లింల అభ్యున్నతికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. మైనార్టీల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ఈ సందర్భంగా మల్లాది విష్ణు ఆకాంక్షించారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …