తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
స్యాతంత్ర్యంసిథ్థించి 75 సం॥రాలు అయిన సందర్భాన్ని పురస్కరించు కొని ప్రజల్లో దేశభక్తి నెలకొల్పుటకు జరగతన్న ఆజాదీకా అమృతోత్సవ్ కార్యక్రమం లో భాగంగా అగష్టు 11నుండి “హర్ ఘర్ తిరంగా ” ఇంటింటా మవ్వనెల జెండా కార్యక్రమం నిర్వహించటం జరుగుతందని తెనాలి సబ్ కలెక్టర్ డా. నిథిమీనా IAS. అన్నారు. సోమవారం స్పందన అనంతరం తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ దేశ స్యాతంత్ర్యం కోసం పాటు పడిన పింగళి వెంకయ్య సమాజంలోని రుగ్మతలను రూపు మాపుటకు నాటకాలద్వారా కృషిచేసిన బళ్లారి రాఘవ జీవితాలు జాతికి స్పూర్తి ఇస్తాయని , అలాగే యువతలో దేశభక్తి చైతన్యం నింపటానికి ర్యలీలు వ్యాసరచన డిబేటు పెయింటింగ్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. దేశవారసత్వ సంపదైన ఉండవల్లి గుహలను(Caves)అగష్టు 11న దర్శించే కార్యక్రమం ఆలాగే జాతీయ నాయకుల విగ్రహాల సందర్శన ఉంటుందన్నారు.
Tags tenali
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …