విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రకృతి వ్యవసాయ పద్దతులను రైతులు పాటించేలా అవగాహన కల్పించాలని ఏపి కమ్యూనిటి మేనేజడ్ నేచురల్ ఫార్మింగ్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ డి.యం.ఎఫ్ విజయకుమారి అన్నారు.
రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ మాస్టర్ ట్రైనర్ల్‌కు బుధవారం వెటర్నరీ కాలనీ స్థానిక అగ్రికల్చర్ అసోసియేషన్ హాల్‌లో రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా ప్రాజెక్టు మేనేజర్ డి.యం.ఎఫ్ విజయకుమారి ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రాజెక్టు మేనేజర్ మాట్లాడుతూ పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్‌టిఆర్, గుంటూరు, పలనాడు, బాపట్ల జిల్లాలకు చెందిన 50 మంది ప్రకృతి వ్యవసాయ మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. రైతు భరోసా కేంద్రాల పరిధిలో నిర్వహించే పొలం బడి కార్యక్రమంలో పాల్గొన్ని ఎక్కువ మంది రైతులు ప్రకృతి వ్యవసాయ పద్దతులు పాటించే విధంగాను ప్రస్తుతం సాగు చేస్తున్న పంటలకు అనుగుణంగా ఆచారించవలసిన ప్రకృతి వ్యవసాయ పద్దతులపై రైతులకు అవగాహన కల్పించి ప్రోత్సహించాలన్నారు. అవసరానికి మించి క్రిమి సంహారిక మందుల వాడకం వలన కలిగే అనార్థలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రకృతి వ్యవసాయ పద్దతిలో పండిరచిన ఆహార ఉత్పత్తులను తినడం వలన కలిగే ప్రయోజనాలపై తెలియజేయాలన్నారు. శిక్షణ కార్యక్రమంలో స్టేట్ తిమేటిక్ లీడ్ సిహెచ్ చంద్రశేఖర్, జండర్ ఆర్. అరుణ ఉన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …