విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వాతంత్య్ర స్పూర్తితో ప్రతి ఒక్కరు పునరంకితులు కావాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు. అజాదీ కా అమృత్ మహోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరిలో స్వాతంత్య్ర స్పూర్తిని నింపేలా బుధవారం స్థానిక పున్నమి ఘాట్‌లో స్కైలాంప్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్, మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, నగర మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్, డిప్యూటి మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శైలజారెడ్డి, విశ్వబ్రహ్మణ కార్పొరేషన్ చైర్మన్ టి శ్రీకాంత్, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ షేక్ ఆసిఫ్‌లుహాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా 15 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. స్వాతంత్య్రం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి అజాదీ కా అమృత్ మహోత్సవాలను నిర్వహించడం ద్వారా ప్రజలు స్వాతంత్య్ర సమరయోధుల సేవలను స్మరించుకునేలా చేసి దేశ భక్తి భావాన్ని పెంపొందించుకునేలా కృషి చేస్తున్నారన్నారు.
శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్ మాట్లాడుతూ విజయవాడ నగరం స్వాతంత్య్ర సంగ్రామంలో కీలకపాత్ర పోషించిందన్నారు. స్వాతంత్య్ర ఉద్యమ సమరంలో చెన్నై నుండి కలకత్తా వెళ్లె మార్గంలో విజయవాడ మీదుగా మహాత్మాగాంధీ 16 సార్లు నగరాన్ని సందర్శించిన చరిత్ర ఉందన్నారు. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నామని శాసనసభ్యులు అన్నారు.
కార్యక్రమంలో నలంద డిగ్రా కళాశాల, పిబి సిద్ధార్థ ఆర్డ్స్ అండ్ సైన్స్ కళాశాల, దుర్గామలేశ్వర డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, శ్రుతిసమన్వి ప్రదర్శించిన కూచిపూడి నృత్యం, ప్రముఖ సింగర్ భావన ఆలపించిన దేశభక్తి గేయాలు అందరిని అలరించాయి. కార్యక్రమంలో జిల్లా ఉపాధి అధికారి పి.వి రమేష్ కుమార్, టూరిజం ఆఫీసర్ హేమచంద్ర, జిజ్ఞాస ఇంటర్‌ఫేస్ లిమిటెడ్ డైరెక్టర్ వి. భార్గవ్, సిఇవో గాయత్రి పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …