క్రీడల్లో రాణించి దేశానికి మంచి పేరు తీసుకురావాలి

-రోలర్ స్కేటింగ్ లో సత్తా చాటిన చిన్నారులకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు అభినందనలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చిన్నారులు క్రీడల్లో రాణించి దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పిలుపునిచ్చారు. గత నెల 23, 24 తేదీలలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(SAAP) ఆధ్వర్యంలో తిరుపతిలో జరిగిన రాష్ట్ర స్థాయి రోలర్ స్కేటింగ్ ఛాంపియన్ షిప్ లీగ్ – 2022 పోటీలలో నగరానికి చెందిన చిన్నారులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఇన్ లైన్ లో అండర్ 9 బాలికల విభాగంలో బేబి ఓజస్వి బంగారు మెడల్, క్వాడ్ లో Ch.తన్మయి వెండి మెడల్ కైవసం చేసుకున్నారు. అండర్ 7 బాలికల విభాగంలో Ch.తస్య సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది. అండర్ 9 బాలుర విభాగంలో జి.యతిన్., అండర్ 7 బాలుర విభాగంలో s.హితాన్ష్, Ch.కేశవన్, G.అనిరుద్, గౌతమ్ సిద్దార్ద్ ఉత్తమ ప్రతిభ కనబరిచారు. వీరందరినీ ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనము నందు బుధవారం ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఘనంగా సత్కరించారు. దేశం గర్వించదగ్గ క్రీడాకారులను తయారుచేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం క్రీడాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తోందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు తెలిపారు. బాల్య దశ నుంచే అంతర్లీనంగా దాగి ఉండే ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారనడానికి ఈ చిన్నారులే చక్కని ఉదాహరణ అని తెలిపారు. రాబోయే రోజుల్లో వీరంతా మరెన్నో అంతర్జాతీయ క్రీడా పోటీలలో పాల్గొని విజయం సాధించాలని.. ఆంధ్రప్రదేశ్ పేరును ప్రపంచ దేశాలకు వ్యాపింపజేయాలని ఆకాంక్షించారు. అనంతరం విజేతలైన క్రీడాకారులకు మెడల్స్‌, ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో కోచ్ మహమ్మద్ ఖాజా, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *