ముత్యాంపాడు షిరిడి సాయిబాబా మందిరంలో భూదేవి, శ్రీదేవి సమేత శ్రీనివాసుని కళ్యాణం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముత్యాలంపాడులో వెలసియున్న శ్రీ షిరిడి సాయి బాబా మందిరంలో గురువారం విశేషమైన పర్వదినం శ్రావణమాసం, విఖనస మహర్షి యొక్క జయంతి, హయగ్రీవ జయంతి, జంధ్యాల పూర్ణిమ, శ్రవణా నక్షత్రంతో కూడినటువంటి రోజు కనుక శ్రీ మహా విష్ణువుకు ప్రీతికరమైన రోజు శ్రీ మహా విష్ణువు కలియుగములో కలియుగనాధునిగా వెలసి మనందరిని అలరిస్తున్న చాలా పుణ్యమైన రోజు ఈ రోజున శ్రీ వేంకటేశ్వర స్వామి వారు వైకుఠములో శ్రీ మహా విష్ణువుగా వెలసిల్లి కలియుగములో శ్రీ వేంకటేశ్వర స్వామిగా వెలసిన రోజు అటువంటి పర్వదినమున లోకమంతా సుభిక్షముగా ఉండాలని అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లాలని మందిర గౌరవాధ్యక్షులు పి.గౌతమ్‌ రెడ్డి, ఉష దంపతులు భూదేవి, శ్రీదేవి సమేత శ్రీనివాసుని యొక్క కళ్యాణం అత్యంత వైభవోపేతముగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి పరమహంస పరివ్రాజకాచార్యులు సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపులైనటువంటి శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌ స్వామి వారి యొక్క అనుంగ శిష్యులు మాధవాచార్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమములో వేలాది భక్తులు పాల్గొని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణమును తిలకించి, తీర్ధ ప్రసాదములు స్వీకరించారు. అనంతరం సుమారు 1500 మంది భక్తులకు అన్నప్రసాదవితరణ జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *