ఘనంగా ఆజాది కా అమృత మహోత్సవం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ స్వాతంత్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన అమర వీరుల త్యాగాలు మరువలేనివని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. శనివారం 15వ డివిజన్ నందు డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ ఆధ్వర్యంలో జరిగిన ఆజాది కా అమృత మహోత్సవం కార్యక్రమంలో భాగంగా హర్ తిరంగా 120 మీటర్ల త్రివర్ణ జెండా 300మంది చిన్నారులతో కొల్లిపర వారి స్ట్రీట్ నుండి పడవలరేవు సెంటర్ వరుకు జరిగిన భారీ జెండా ర్యాలీకి అవినాష్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా అవినాష్ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యo వచ్చి 75 సంవత్సరాలు నిండిన సందర్భంగా దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్న అజాద్ కా అమృత్ మహోత్సవ కార్యక్రమo గురుంచి రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకొని నిర్వహిస్తుందన్నారు.మహానీయుల త్యాగాల ఫలితమే నేటి స్వాతంత్య్రమని, వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. దేశాన్ని ప్రపంచంలో ఉన్నతంగా నిలిపేందుకు కృషి చేస్తున్న వారి సేవలు మరువలేనివన్నారు.దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది త్యాగాలు చేశారని,అటువంటి వ్యక్తులను స్మరించుకునే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా లభించిoదన్నారు. స్వాతంత్ర్య సంగ్రామంలో ఎంతోమంది సమరయోధులు తమ ధనమాన ప్రాణాలను అర్పించి స్వాతంత్ర్యం కోసం పోరాడారన్నారు.వారిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం ఎంతో అభినందనీయమన్నారు. భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియపరచడంలో మనందరం కూడా క్రియాశీలక పాత్ర పోషించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చెల్లారావు, శ్రీ సాయి బాలవిద్యాలయం ప్రిన్సిపల్ రమణారెడ్డి, సెక్రట్రీ చెన్నయ్య,సుధాకర్, వెంగళరెడ్డి,మరియు విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *