అమర వీరుల త్యాగాల ఫలితమే నేడు మనకి స్వేచ్చా స్వాతంత్య్రం…

-మంత్రి జోగిరమేష్‌.
-విజయవాడ బందర్‌ రోడ్‌లో 20 వేల మందితో స్పూర్తి ప్రదర్శన…
-మూడున్నర కిలోమీటర్ల జాతీయ పతాకంతో మానవహారం…
-భారతమాతాకు జై… అమరవీరులకు జోహార్‌… నినాదాలతో హోరేత్తిన యంజి రోడ్డు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా విజయవాడలో నిర్వహించిన హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాని ఘనంగా నిర్వహించారు. అంచనాలకు మించి విద్యార్థిని విద్యార్థులు జాతీయ పతాకాన్ని చేతపట్టి మానవ హారంలో పాల్గొన్నడానికి నగర నలుమూలల నుంచి తరలివచ్చారు. మూడున్నర కిలోమీటర్ల జాతీయ పతాకాన్ని ఇరువైపుల విద్యార్థులు చేతబూని భారత్‌ మాతాకు జై…. అమరవీరులకు జోహార్‌…. అంటూ విద్యార్థిని విద్యార్థులు చేసిన నినాదాలతో మహాత్మాగాంధీ రోడ్డు హోరేత్తింది. ప్రత్యేక వాహనంలో ఏర్పాట్లు చేసిన మూడున్నర కిలో మీటర్ల జాతీయ పతాకాన్ని బెంజ్‌ సర్కిల్‌ నుండి ప్రారంభమై విద్యార్థులకు అందజేస్తూ కంట్రోల్‌ రూమ్‌ వరకు చేరుకుంది. 10 నుండి 15 వేల మంది హర్‌ ఘర్‌ తిరంగాలో పాల్గొంటారని జిల్లా యంత్రాంగం భావించింది. 8 గంటల నుండే తరలివచ్చే విద్యార్థిని విద్యార్థులను చూసి ఉత్సహాన్ని నింపుకున్న రెవెన్యూ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరి రజిత్‌ బార్గవ్‌, జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావులు స్వయంగా ద్విచక్ర వాహనం పై మహాత్మాగాంధీ రోడ్డులో కలియ తిరుగుతూ విద్యార్థిని విద్యార్థులకు నిర్వహకులకు సూచనలు ఇచ్చారు. 9:30 గంటలకు దాదాపు 20 వేల మందికి పైగా విద్యార్థుల మానవహారంతో హర్‌ ఘర్‌ తిరంగా వేడుకతో నగరం పులకించింది. బెంజ్‌ సర్కిల్‌లోని ట్రెండ్‌సెట్‌ మాల్‌, లబ్బిపేటలోని పివిపి మాల్‌, పిడబ్ల్యూగ్రౌండ్స్‌ బస్టాప్‌, పాత బస్టాడ్‌ వద్ద ఏర్పాటు చేసిన వేదికలపై విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గీతాలాపాన నృత్య ప్రదర్శనలు, విచిత్ర వేషదారణలు, ప్రజలను అలరించాయి.
లబ్బిపేట లోని పివిపి మాల్‌ వద్ద ఏర్పాటు చేసిన ప్రధాన వేదిక వద్ద రాష్ట్ర మంత్రులు జోగి రమేష్‌, విడదల రజిని, నగరమేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, మాజీ మంత్రి శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాస్‌రావు, శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్‌, శాసన మండలి సభ్యులు రుహుల్లా, రాష్ట్ర ఉన్నతాధికారులు రజిత్‌బార్గవ్‌, శ్రీలక్ష్మి, బి. రాజశేఖర్‌, సురేష్‌కుమార్‌, జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు, నగర పోలీస్‌ కమీషనర్‌ కాంతి రాణా టాటా, మున్సిపల్‌ కమీషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుడ్కర్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌, ఏపి హైయర్‌ ఎడ్యుకేషన్‌ చైర్మన్‌ హేమచంద్రారెడ్డిలు జ్వోతి ప్రజ్వలన చేసి సభా కార్యక్రమాన్ని ప్రారంభించి జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
సభా వేదిక నుండి రాష్ట్ర గృహా నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ మాట్లాడుతూ అచంచలమైన దేశభక్తి కలిగిన మన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా అజాదీ కా అమృత్‌, హర్‌ ఘర్‌ తిరంగా, అమృత్‌ సరోవర్‌ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని ఆదేశించారన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడి 2021 మార్చి 13వ తేదీన సబర్మతి ఆశ్రయం వద్ద ప్రారంభమైన అజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమాన్ని మన రాష్ట్ర ంతో పాటు దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అజాదీ కా అమృత్‌ మహోత్సవ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. విజయవాడ నగరం బందర్‌ రోడ్డు మొత్తం త్రివర్ణ పతాకంతో దేశభక్తిని చాటుతూ స్వాతంత్రోద్యమ స్పూర్తిని గుర్తుకు తెస్తున్నామన్నారు. 75 సంవత్సరాల స్వాతర్రత్య భారత చరిత్రలో మనం నేడు అనుభవిస్తున్న స్వాతంత్య్ర ఫలాలు నాటి మహనీయుల త్యాగాల ఫలితమే అన్నారు. స్వాతంత్య్ర సమపార్జునలో అసువులు బాసిన అమరవీరులకు జోహార్లు అంటూ వినదించారు. ఎందరో త్యాగదనుల త్యాగఫలం నేటి 75 వసంతాల అజాదీ కా అమృత్‌ మహోత్సవం అని మంత్రి అన్నారు. దేశ నుండి బ్రిటిష్‌ వారిని తరిమికొట్టే క్విట్‌ ఇండియా ఉద్యమంలో ఎందరో మహానుభావులు ఆసువులు బాసారని మరెందరో జైళ్ళుకు వెళ్లారని జైలు గోడలను బద్దలు కొట్టి తమ స్వాతంత్ర సమరస్పూర్తిని ప్రదర్శించారన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాలు స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తూ ప్రపంచంలో మన దేశం నెంబర్‌ వన్‌ స్థాయికి చేరుకుంటుందని ప్రంపచానికి తెలియజేసే విధంగా అజాదీ కా అమృత్‌ మహోత్సవాలు నిర్వహించుకుంటున్నామన్నారు. విజయవాడ నగరం స్వాతంత్రోద్యమ సమయంలో కీలక నగరంగా ఉందన్నారు. స్థానిక పిడబ్ల్యూడి గ్రౌండ్‌లో ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ కమిటీ సమావేశాలు జరిగాయని ఇక్కడ నుండే స్వాతంత్య్ర ఉద్యమం స్పూర్తి ప్రారంభమైందన్నారు. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య మన జిల్లా వాసి అవటం మనకు గర్వకారణం అన్నారు. ప్రపంచలోనే మన దేశం నెంబర్‌ వన్‌ గాను దేశంలోనే మన రాష్ట్రం నెంబర్‌ వన్‌గా తీర్చిదిద్దటంలో అహర్నిశలు ్ఱశ్రమిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ స్వాగతిద్దాం అన్నారు. మనందరం ఒక్కటే అనే వినాదంతో ఐకమత్యంగా ఉండి ముక్తకంఠంతో నెంబర్‌ వన్‌ స్థానానికి చేరుకునేందుకు సమిష్టిగా కృషి చేద్దామని మంత్రి జోగి రమేష్‌ అన్నారు.
శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్‌ మాట్లాడుతూ హర్‌ఘర్‌ తిరంగా కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం అనందాన్ని ఇస్తుందన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల జీవిత చరిత్రను ప్రతి విద్యార్థి తెలుసుకోవాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక శ్రద్దతో రాష్ట్ర వ్యాప్తంగా అజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాలను పండుగలా నిర్వహిస్తున్నారని శాసనసభ్యులు అన్నారు.
మాజీ మంత్రి శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమ పోరాట త్యాగాలను స్మరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హర్‌ ఘర్‌ తిరంగా ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్య్ర ఉద్యమ స్పూర్తిని భావితరాలకు తెలియజేయాలన్నారు.స్వాతంత్య్ర ఉద్యమంలో ఆసువులు బాసిన మహానీయుల పోరాటం త్యాగాలను స్మరించుకోవాలని జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని మాజీ మంత్రి శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాస్‌ అన్నారు.
సందేశాల అనంతరం మూడు రంగుల బెలూన్స్‌, శాంతికి చిహ్నమైన కపోతాలను ఆకాశంలో ఎగురవేశారు.
కార్యక్రమంలో డిప్యూటి మేయర్లు అవుతు శ్రీ శైలజారెడ్డి, బెల్లం దుర్గ, తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాష్‌, ఏపిఐఐసి చైర్‌పర్సన్‌ బండి పుణ్యశీల, డిప్యూటి కలెక్టర్‌ రామలక్ష్మి, మెప్మా యండి విజయలక్ష్మి, డ్విమా పిడి జె. సునీత, జిల్లా విద్యాశాఖ అధికారిని సివి.రేణుక, విద్యార్థిని విద్యార్థుల తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *