ప్రతి ఒక్కరు స్వాతంత్ర్య వజ్రోత్సవాలలో భాగస్వామ్యులు కావాలి… : కలెక్టర్ రంజిత్ బాషా

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
స్వాతంత్ర్య ఉద్యమ పోరాట ప్రాశస్త్యం, పోరాట యోధుల స్ఫూర్తి, అమరవీరుల త్యాగ నిరతి వర్తమాన తరానికి అందించేందుకు ఉద్యుక్తులు కావాలని, అందుకు గాను ప్రతి ఒక్కరు స్వతంత్ర వజ్రోత్సవాలలో భాగస్వామ్యులు కావాలని కృష్ణాజిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పిలుపునిచ్చారు.
శనివారం ఉదయం ఆయన మచిలీపట్నం మండలం అరిసేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చిట్టిపాలెం గ్రామంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. చిట్టిపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థిని విద్యార్థులు 150 అడుగుల పొడవైన త్రివర్ణ పతాకంతో కూడిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.పలువురు చిన్నారులు జాతీయ ఉద్యమ నాయకుల వేషధారణతో ముచ్చటగా కనబడతూ ర్యాలీకి నూతన ఉత్తేజం కల్పించారు. చిట్టిపాలెం గ్రామంలో వందలాధిగా ప్రజలు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొనగా ఈ ర్యాలీ 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమృత్ సరోవర్ వరకు కొనసాగింది. చెరువు గట్టుపై ఏర్పాటు చేసిన భారీ జాతీయ జెండాను కలెక్టర్ ఆవిష్కరించారు. తొలుత జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా జాతిపిత మహాత్మా గాంధీజీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ , భార‌త రాజ్యాంగ నిర్మాత‌, బాబా సాహెబ్ డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు.
ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆజాదీకా అమృత్ మ‌హోత్స‌వాల్లో ప్ర‌తీఒక్క‌రూ భాగ‌స్వాములు కావాల‌ని కోరారు.ఈ నెల 13 నుంచి 15 వరకు తిరంగాను ఇంటికి తీసుకొచ్చి నివాసాలపై పతాకావిష్కరణ గావించాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపును ప్రతి ఒక్కరూ ఆచరించాలన్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సమయంలో జాతీయ జెండా దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలను సూచిస్తున్నదని తెలిపారు. జాతీయ జెండా మనకు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. అహింసాయుత మార్గంలో స్వాతంత్రం సాధించిన మహాత్మాగాంధీ సంకల్పాన్ని నేటి తరానికి అందించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు. పోరాటాలలో అహింసాయుత పోరాటామే ఎంతో కఠిన తరమైందని, అటువంటి పోరాటాన్ని ఎంచుకుని బారతదేశాన్ని విజయతీరాలకు చేర్చిన మహాత్మాగాంధీ గురించి వర్తమాన తరానికి సరిగా తెలియడం లేదన్నారు. తిరంగా ఉత్స‌వాల‌ను విజ‌య‌వంతం చేసేందుకు కృషి చేయాల‌ని కోరారు. జాతీయ స్ఫూర్తిని ప్ర‌తిబింబించేలా, జిల్లాలోని అన్నిప్ర‌భుత్వ భ‌వ‌నాల‌ను తీర్చిదిద్దాల‌ని, జాతీయ ప‌తాకాన్ని ఎగుర‌వేయాల‌ని సూచించారు. భ‌వ‌నాల‌ను విద్యుత్ దీపాల‌తో అలంక‌రించాల‌ని సూచించారు .
ఈ కార్య‌క్ర‌మంలో డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ , మచిలీపట్నం ఎంపిడివో జీ వి సూర్య నారాయణ, ఆర్డీవో ఐ. కిషోర్, తహశీల్ధార్ సునీల్ బాబు, మండల విద్యాశాఖాధికారి దుర్గ ప్రసాద్, చిట్టిపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు వై. సుధారాణి, ఫిజికల్ డైరెక్టర్ ఆత్మూరి అశోక్, చిట్టిపాలెం పార్టీ ఇంచార్జ్ చండిక అజయ్ కుమార్, డ్వామా ఏ పి ఓ రామ్మోహన్ చిట్టిపాలెం గ్రామ కార్యదర్శి నరసింహారావు, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *