49వడివిజన్ లో ఘనంగా ఆజాది కా అమృత్ మహోత్సవ్ పండుగ…

విజయవాడ,నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్య అతిధి గా కార్యక్రమం లో పాల్గొన్న కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ భారతదేశానికి స్వాతంత్ర్యం ల‌భించి 75 ఏళ్లు పూర్త‌వుతున్న సంద‌ర్భంగా దేశప్రజలందరు పండుగ వాతావరణంలో జరుపుకుంటున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం 49వడివిజన్ లో ఘనంగా నిర్వహించడం జరిగిందిస్థానిక మట్టాలాజరస్ స్కూల్ నుండి విద్యార్థిని విద్యార్థులు మువ్వన్నెల జెండా తో భారత మాతకు జేజేలు పలుకుతూ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ ముఖ్య అతిధిగా పాల్గొని దేశమంతటా ఈ ఆజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం పండుగ వాతావరణాన్ని నెలకొల్పింది, ఎందరో మహానుభావుల త్యాగఫలితం ఈరోజు ఈ 75సంవత్సరాల స్వతంత్ర వేడుకలు కనుక ప్రతీ ఒక్కరు బాధ్యత గలపౌరులుగా నడుచుకోవాలి అని వ్యాఖ్యానిస్తూ ముందస్తుగా అందరికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మట్టా లజరస్ స్కూల్ ప్రిన్సిపాల్ బసవేశ్వరరావు, మరియు ఉపాధ్యాయులు, సచివాలయ అడ్మిన్ విగ్నేశ్వర రావు, సచివాలయ ఉద్యోగులు ప్రసాద్, విజయరాజు, హరిబాబు, శ్రీనివాసరావు, భార్గవి,రేష్మ, జ్యోతి, సునీత, రత్నకుమారి, వాలంటీర్లు మాతంగి అనిల్, మెర్సీ, స్వరూప తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *