విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు భారత స్వాతంత్య్ర ఉద్యమంలో మహిళా ఉద్యమ నేతలు అందించిన సేవలు అజరామరం అని వారిని ఆదర్శంగా తీసుకొని దేశాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు.అజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని వాసవ్య మహిళ మండలి ఆధ్వర్యంలో మహిళలతో నిర్వహించిన ర్యాలీని ఆదివారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు ఆయన క్యాంప్ కార్యాలయంలో ప్రారంభించి మహిళలలో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ బందర్ రోడ్డు మీదిగా బాపు మ్యూజియం చేరుకుంది. బాపు మ్యూజియం వద్ద మహిళలను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత స్వాతంత్య్ర ఉద్యమంలో సరోజిని నాయుడు, ఝాన్సీ లక్ష్మిబాయ్, అరుణ అసిపాలి,కమల నెహ్రూ, దుర్గభాయ్ దేశ్ ముఖ్, బేగం అజరాత్ మహల్, అనిబిసెంట్ వంటి ఎంతో మంది మహిళ ఉద్యమనేతలు ప్రధాన భూమికను పోషించారన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా శ్రీమతి ఇందిరా గాంధీ లాంటి ధైర్యసాహసాలు గల మహిళలు న్యాయకత్వాన్ని చేపట్టడం జరిగిందన్నారు. మహిళ లేనిదే సృష్టి లేదని స్త్రీలను గౌరవించుకోవడం మన హిందూ సంప్రదాయమన్నారు. అటువంటి సంప్రదాయాన్ని మనం కోనసాగిస్తున్నామని ఆయన ప్పటికి స్త్రీలను మరింత గౌరవించి వారిని అన్ని రంగాలలో మందుండేలా ప్రోత్సహించవలసిన భాద్యత మనకుందన్నారు. మహిళలపై జరుగే దాడులు, హత్యచారాలను అరికట్టాల్సిన భాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రానున్న 25 సంవత్సరాలలో మహిళలదే ప్రధాన భూమిక కాబోతుందన్నారు. మహిళ న్యాయకత్వం వహించిన ఏ రంగం ఐన వ్యవస్తయినా విజయవంతంగా కొనసాగుతాయన్న దానికి గత అనుభవాలే నిదర్శనం అన్నారు. మహిళల ప్రజా స్వామ్యం హక్కులను కాపాడేందుకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. మహిళ లీడ్ చేసిన కుటుంబం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మహిళలు నిర్వహిస్తున్న రంగం కూడా అంతే అభివృద్ధి చెందుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సహకారాన్ని మహిళలు సద్వినియోగం చేసుకొని పురోగతిని సాధించాలని జిల్లా కలెక్టర్ డిల్లీరావు అన్నారు.ఈ సందర్భంగా ప్రముఖ టెబుల్ టెన్సిస్ క్రీడాకారిణి పైల్ నూర్ బాషా, పవర్ లిప్టర్ షాదీయ అల్మాస్‌లను జిల్లా కలెక్టర్ ఘనంగా సత్కరించారు.వాసవ్య మండలి అధ్యక్షురాలు డా. కీర్తి, మెడికల్ డైరెక్టర్ డా.దీక్ష, బిజినెస్ నెట్ వర్క్ డైరెక్టర్ విశాలదేశాయ్, జిల్లా యోజన సంక్షేమ అధికారి శ్రీనివాసరావు, ఉపాధి కల్పన అధికారి పివి రమేష్ చైల్డ్ లైన్ కో`ఆర్డినేటర్ అరవ రమేష్, మెర్రి స్టెల్లా, లయోలా కళాశాల విద్యార్థునులు యన్ సిసి స్కౌడ్స్ మరియు గైడ్స్ కాండిడెట్స్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …