ఏపీ ధార్మిక పరిషత్ ఏర్పాటు నిర్ణయంపై హర్షం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చినందుకు వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రచార పరిషత్ (వీ బీ ఎస్ పి పి) హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు విజయవాడ ప్రెన్ల క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వీ బీ ఎస్ పి పి వ్యవస్థాపకులు పాలెపు శ్రీనివాసులు మాట్లాడుతూ ధార్మిక పరిషత్ ఏర్పాటుకు చొరవ తీసుకుంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి కొట్టు సత్యనారాయణలకు అభినందనలు తెలిపారు. 2021 సెప్టెంబరులో కొందరు స్వార్ధపూరిత అధికారులు జగన్ ప్రభుత్వానికి హిందూ వ్యతిరేక ముద్ర వేయాలనే కుట్రతో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ సంస్థల చట్ట సవరణ చేశారని ఆరోపించారు. ఈ సవరణ ద్వారా ధార్మిక పరిషత్ను ప్రభుత్వం ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితిలో అధికార సభ్యులైన మంత్రులు, కమిషనర్, టీటీడీ ఈవో, ప్రిన్సిపల్ సెక్రటరీలు నిర్ణయం తీసుకోవచ్చుని పేర్కొనటం జరిగిందన్నారు. ఈ సవరణను వెనక్కు తీసుకుకోవాలని డిమాండ్ చేశారు. ధార్మిక పరిషత్ను ఏర్పాటు చేయలేని పరిస్థితిలో అప్పటికి ఉన్న పరిషత్ కాలపరిమితిని పొడిగించాలి తప్ప నలుగురు అధికారులు నిర్ణయం తీసుకునేలా చట్టం ఉండకూడదన్నారు. ప్రజాశ్రేయస్సు కోరే రాజకీయ నాయకత్వానికి తప్పుడు నలహాలు అందించే వీలుంటుందన్నారు. చట్టాలను పకడ్బందీగా రూపొందించటానికి ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో వీ బీ ఎస్ పి పి సభ్యులు విప్పర్ల శ్రీనివాసరావు, లక్ష్మీ సుజాత, హరినాధ్ బాబు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *