ఓదెల , నేటి పత్రిక ప్రజావార్త :
పురాతన సాంబశివ ఆలయ పునర్నిర్మాణ పనులను ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మరియు ఎంపీ వెంకటేష్ నేత తో కలిసి ప్రారంభించారు. బుధవారం ఓదెల మండలం కొలనూర్ గ్రామంలో ఎమ్మెల్యే కృషి తో రూ, 48 లక్షల రూపాయలతో నిర్మించ తలపెట్టిన సాంబ శివాలయ పునర్నిర్మాణ పనులను ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత మాట్లాడుతూ తనవంతు సహాయంగా తన ఎంపీ నిధుల నుండి 10,00000(10లక్షలు) త్వరలోనే మంజూరు చేస్తాననీ హమీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఐరెడ్డి వెంకట్ రెడ్డి, సర్పంచ్ మణెమ్మ-శంకర్,ఎంపీటీసీ శ్రీనివాస్, ఉప సర్పంచ్ సంపత్ రెడ్డి, ఆలయ చైర్మన్ రాజిరెడ్డి, బండారి ఐలయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు నరేందర్, ఓదెలు, సాతురి రాజేశం, రవి, మధు, ఆలయ పాలక వర్గం, గ్రామ ప్రజలు తోపాటు పూజారులు పాల్గొన్నారు.
Tags hyderabad
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …