-49 వ డివిజన్ లో రూ. 51.70 లక్షలతో మున్సిపల్ కమ్యూనిటీ హాల్ మొదటి అంతస్తు నిర్మించు పనులకు శంకుస్థాపన
-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
49 వ డివిజన్ పరిధిలో జొడబొమ్మల సెంటర్ లో వున్న ముక్కా వెంకట రమణ, హైమావతి గార్ల మున్సిపల్ కమ్యూనిటీ హాల్ మొదటి అంతస్తు నిర్మించు పనులకు శంకుస్థాపన కార్యక్రమములో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, స్థానిక కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ కలసి మేయర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రూ. 51.70 లక్షలతో నగరపాలక సంస్థ జనరల్ ఫండ్స్ తో మున్సిపల్ కళ్యాణ మండపమునకు మొదటి అంతస్తు నిర్మించు పనులకు చేపట్టడం జరుగుతుంది అని ఆమె వివరించారు. నగర అభివృద్ధిలో ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంగా వై.సి.పి ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించి అనేక కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిందని, నిర్దేశించిన గడువు ప్రకారం నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ప్రాంత వాసులు చిన్న చిన్న కార్యక్రమాలు నిర్వహించుకొనుటకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, మరియు సచివాలయ సిబ్బంది కూడా ఏదైనా సమావేశాలు నిర్వహించుకొనుటకు కూడా అనువుగా ఉంటుందని అన్నారు. కార్యక్రమములో నగరపాలక సంస్థ అధికారులు సిబ్బంది మరియు స్థానిక వై.సి.పి శ్రేణులు పాల్గొన్నారు.