విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో ఇంపాక్ట్ ఫౌండేషన్ సంయుక్తం సహకారంతో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం లో ఆదివారం స్కిల్ డెవలప్మెంట్ వ్యక్తిత్వం వికాసం అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఇంపాక్ట్ వ్యవస్థాపకులు గంపా నాగేశ్వరరావు మాట్లాడుతూ నేటి యువతకు స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ వ్యక్తిత్వ వికాసం అవసరమన్నారు. 2012 నుండి విశాఖ, నెల్లూరు, ఖమ్మం, రంగారెడ్డి, తదితర ప్రాంతాల్లో ఓకే వేదికపై రెండు రోజులపాటు కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఇప్పుడు విజయవాడ ఎడ్యుకేషన్ హబ్ గా ఉందని అన్నారు. దానిని దృష్టిలో ఉంచుకొని రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ కృష్ణ ప్రభు, కే ఎస్ ఎన్ బాబు సహకారంతో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో లైఫ్ స్కిల్స్ గురించి మాట్లాడించి విద్యార్దులకు అవగాహన కల్పించా మన్నారు. ప్రతి ఇంటిలో ఒక స్పీకర్ తయారవ్వాలన్నారు. ఈ సదస్సులో పాల్గొనే విద్యార్థులకు ఉచితంగా అవకాశం కల్పించామని అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ మిడ్ టౌన్ ప్రెసిడెంట్ విజయవాడ మాగంటి కృష్ణ ప్రభు మాట్లాడుతు ఇప్పటికి మా మిడ్ టౌన్ లో సుమారు 1000 మంది సభ్యులు ఉన్నారని వారందరు సహకారంతో 13 ఆర్గాన్ డొనేషన్, అంగ వైకల్యం వారి కోసం జోనల్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ నాలుగు రాష్ట్రాల వారితో నిర్వహించామని వీటితో పాటు ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించమని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో యువతలో కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్మెంట్ కోసం ఇంపాక్ట్ వారితో కలిసి ఈ రెండు రోజుల అవగాహన కార్యక్రమ నిర్వహించామన్నారు. ఇటువంటి కార్యక్రమాలలో ఇది మూడవది అని అన్నారు. ఈ రెండు రోజుల కార్యక్రమాలకు సుమారు 2000 మంది పైనే విద్యార్దులు, తల్లిదండ్రులు. హాజరయ్యారన్నారు. తమ వంతు సహకారం గా విజయవాడ కార్పొరేషన్ వారు అతి తక్కువ ధరకు ఆడిటోరియాన్నీ అందజేశారన్నారు. తమ క్లబ్ తరఫున ఈ కార్యక్రమానికి 6 లక్షలు ఖర్చు చేశామన్నారు. దీనితో పాటు పేద వారికి 500 కేటరాక్ట్ ఆపరేషన్ లు, 500 కుట్టు మిషన్లు పంపిణీ, ఆటల పోటీలు ఈ సంవత్సరం నిర్వహించనున్నామన్నారు. ఇప్పటి పిల్లలు, పెద్దలు సెల్ ఫోన్ కు బానిసలు అవుతున్నారని దాన్ని అవసరం ఉన్న వరకే వాడుకోవాలని సూచించారు. యండమూరి రవీంద్ర నాధ్, ఎండి ఇంతియాజ్ ఐ ఏ ఎస్. శ్రీధర్ బాబు ఐ ఏ ఎస్ తదితరులు స్పీకర్స్ గా హాజరు అయ్యారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ మిడ్ టౌన్ సెక్రటరీ కె ఎస్ ఎన్ బాబు, బి రామ్మోహన్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ కారంకౌల్, యూత్ సర్వీసెస్ జాయింట్ సెక్రటరీ సయ్యద్ మన్సూర్ హమ్మద్, డైరెక్టర్ రాళ్లపల్లి శ్రీనివాస్, దేవా కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …