విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సచివాలయ,వలంటీర్ వ్యవస్థ ద్వారా గడప గడపకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి అంటే అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంకల్పం వలనే సాధ్యం అయ్యింది అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ పరిధిలోని 22వ డివిజన్,గంగానమ్మ గుడి రోడ 1,2,3 వీధుల ప్రాంతాల్లో ఇంటి ఇంటికి పర్యటించిన అవినాష్ వారికి అందిన సంక్షేమ పథకాల వివరాలను కరపత్రాల రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అవినీతిరహిత పారదర్శక పాలనే లక్ష్యం గా వలంటీర్ వ్యవస్థ ద్వారా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నారు అని అన్నారు.గత టీడీపీ పాలనలో అర్హత ఉన్న సరే కార్యాలయాల చుట్టూ కల్లారిగేలా తిరిగి,జన్మభూమి కమిటీ సభ్యులకు లంచాలు ఇస్తే గాని పని అయ్యేది కాదని విమర్శించారు.ఈ ప్రాంతంలో అధిక శాతం ప్రజలు స్వర్గీయ వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి, వైసీపీ పార్టీకి అభిమానం గా ఉండేవారని అందుకే గత రెండు పర్యాయాలు కూడా ఇక్కడ కార్పొరేటర్ గా మా పార్టీ వారే ఎన్నికయ్యారు అని అన్నారు.ఆ కారణంగా గత టీడీపీ ప్రభుత్వం లో ఈ డివిజన్ అభివృద్ధి కి నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసారని, ప్రజల బాగోగులు పట్టించుకోలేదు అని విమర్శించారు. కానీ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక సైడ్ డ్రైనేజీలు,రోడ్లు, మంచినీటి సౌకర్యం కల్పించడం జరిగిందని ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అని అన్నారు. అదేవిధంగా మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం లో ఇచ్చిన హామీ మేరకు దాదాపు మూడు కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని వీలైనంత త్వరగా నిర్మాణాలను పూర్తి చేసి అందుబాటులో కి తీసుకొస్తామని అన్నారు.ఇచ్చిన ప్రతి హామీని పూర్తి చేసి ప్రజలు మా మీద పెట్టుకొన్న నమ్మకాన్ని నిలబెట్టుకొంటామని అవినాష్ ధీమా వ్యక్తంచేశారు. మా కార్పొరేటర్, నాయకులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో 22వ డివిజన్ కార్పొరేటర్ తాటిపర్తి కొండారెడ్డి గాంధీ కోపరేటివ్ బ్యాంక్ డైరక్టర్ జోగా రాజు, వైస్సార్సీపీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, దుర్గారావు, గోపాల్ రెడ్డి, ప్రబాకర్ రెడ్డి, నాగిరెడ్డి,రమణారెడ్డి, ఫజులుద్దీన్, ప్రభాకర్, జావీద్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …