విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని అమరావతిలో వక్స్ ఆస్తులకు రెక్కలొస్తున్నాయని, భూ బకాసురులు చట్టంలోని లొసుగులను ఆధారం చేసుకొని కబ్జాలకు పాల్పడుతున్నారని మైనారిటీ సంక్షేమశాఖ, ప్రభుత్వ కార్యదర్శి ఇంతియాజ్‌కి మంగళవారం అందజేసిన వినతిపత్రంలో తెలియజేసినట్లు తెదేపా రాష్ట్ర నేత ఎం.ఎస్.బేగ్ తమ కార్యాలయం నుండి విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. పారదర్శకత కానరావడంలేదని, రాజకీయుల అండదండలతో వక్స్ ఆస్తులను అప్పనంగా ఆరగిస్తున్నారని, దాతలు, ప్రభుత్వాల ఆశయం నీరుగారుతోందన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖల మాదిరిగా వక్స్ చట్టాన్ని బలోపేతం చేయాల్సిన సమయం అత్యవసరమైందన్నారు. మొన్నటికి మొన్న నిడమానూరు, నిన్న కంకిపాడు ప్రాంతాల వక్స్ భూముల ఆక్రమణల తంతుని చూసాం. నేడు కోట్లాదిరూపాయల ప్రభుత్వ నిధులతో నిర్మించిన బహుళ అంతస్థుల షాజహూర్ ముసాఫిర్ ఖానా (వక్స్) వ్యాపార వాణిజ్య సముదాయం కూడా రాజకీయులు, భూ బకాసురుల కబంధ హస్తాల్లో చిక్కుకుందని, సీల్డ్ టెండర్ కం ఆక్షన్ ద్వారా అందుబాటులోకి తేవాలన్నారు. ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఈ వ్యాపార, వాణిజ్య కళ్యాణ మండపంలోని ప్రతి విభాగ కేటాయింపు ఆన్లైన్ ఆక్షన్ ద్వారా నిర్వహించాలన్నారు. అప్పుడు మాత్రమే ప్రభుత్వ ఆశయం నెరవేరుతుందన్నారు. ఆన్లైన్ పద్ధతిని దుకాణాల కేటాయింపులో ప్రవేశపెట్టాలన్నారు.
Tags vijayawada
Check Also
సోలార్ పవర్ కార్పోరేషన్ 2025 డైరీ, క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి గొట్టిపాటి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ సోలార్ పవర్ కార్పోరేషన్ 2025 డైరీ, క్యాలెండర్ ను చీఫ్ సెక్రటరీ …