మట్టి వినాయకుడ్ని పూజించి పర్యావరణంలో భాగస్వామ్యులు కావాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడ్ని పూజించి పర్యావరణంలో భాగస్వామ్యులు కావాలని సెర్ఫ్‌ సిఈవో ఏఎండి ఇంతియాజ్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు కోరారు.
వినాయక చవితిని పురస్కరించుకొని పర్యావరణ మానవ సమాజ భద్రతా`బాధ్యత ఫౌండేషన్‌ మరియు ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టర్‌ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన ఉచిత మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమానికి సీఈవో ఏఎండి ఇంతియాజ్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు ముఖ్య అతిధులుగా పాల్గొని వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఏ ఎండి ఇంతియాజ్‌ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం వాతావరణంలో వస్తున్న మార్పుల వలన అనేక దుష్పరిమాణాలను ఎదుర్కుంటున్నామన్నారు. ఇందుకు కారణం పర్యావరణంలో సమతుల్యం దెబ్బతినడమే అన్నారు. పర్యావరణ సమతౌల్యం కాపాడి భావితరాలకు కాలుష్య రహిత వాతావరణాన్ని అందించడానికి సమిష్టిగా కృషి చేద్దాం అన్నారు.
జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు మాట్లాడుతూ ప్రమాదకరమైన రంగులు, రసాయనాలతో తయారు చేసే వినాయక విక్రగహాలతో కాకుండా సహజ సిద్దమైన మట్టి వినాయకుడ్ని పూజించాలన్నారు. ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ కలర్స్‌ కెమికల్స్‌ తో చేసిన విగ్రహాల కారాణంగా పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. పండుగలను పర్యావణహితంగా జరుపుకోవడం పిల్లలకు పర్యావరణం పట్ల అవగాహన కల్పించడం గణనాధులను భక్తి శ్రద్దలతో పూజిద్దామన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు భద్రతా`భాద్యత ఫౌండేషన్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఆధ్వర్యంలో రెండువేల మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేయడం అభినందనీయం అన్నారు.
కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌, డిఆర్‌వో మోహన్‌కుమార్‌, ఎన్‌జివో జిల్లా అధ్యక్షులు జె. విద్యాసాగర్‌, సిటి ఉపా అధ్యక్షులు జె. స్వామి, భాద్యత ` భద్రతా ఫౌండేషన్‌ నిర్వహకులు సింగనూరి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *