విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సచివాలయల పరిధిలో ప్రజల నుండి అందిన ఆర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు అన్నారు. రాణిగారి తోట 22వ డివిజన్‌లో 101,84 వార్డు సచివాలయాలను మంగళవారం జిల్లా కలెక్టర్ డిల్లీరావు ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రజలకు అందిస్తున్న సేవల వివరాలను సచివాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించి వార్డు సచివాలయాల పరిధిలో ప్రజల సమస్యలను పరిష్కరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను అర్హులైన లబ్దిదారులకు అందించే విధింగా సిబ్బంది వారికి అవగాహన కల్పించాలన్నారు. సచివాలయాలకు వచ్చే ప్రజలతో మార్యాదపుర్వకంగా వ్యవహరించాలన్నారు. అనంతరం స్పందన ఏపి సేవ పోర్టల్‌లో ఆర్జీల పెండిరగ్ వివరాలు వాలంటీర్ల బయోమెట్రిక్ హాజరు, ఓటిఎస్, అమ్మఒడి, రేషన్‌కార్డులు వంటి వాటి ఆర్జీల పరిష్కారాన్ని పరిశీలించారు. గడువులోగా పరిష్కరించవలసిన ఆర్జీలు నిర్ణిత గడువులోపే పరిష్కారం చూపాలన్నారు. ఆయా సచివాలయ సిబ్బందితో మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ పాలన వ్యవస్థను ప్రజలకు చేరువ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ప్రభుత్వ ఆశయాల అనుగుణంగా సచివాలయ సిబ్బంది విధులు నిర్వర్తించి ప్రజలకు సుపరిపాలన అంధించాలన్నారు. వార్డు పరిధిలో లబ్ది పొందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారుల జాబితాలను ప్రథకాల వారీగా సచివాలయ నోటీసు బోర్డులలో ప్రదర్శించాలని, అదేవిధంగా అనర్హుల జాబితాలను, అందుకు గల కారణాలను కూడా తెలియజేస్తూ నోటీసు బోర్డులో ప్రదర్శించాలన్నారు. అర్హత కలిగివుండి పథకాల లబ్ది పొందలేదనే విమర్శలు ప్రజల నుండి రానీయరాదన్నారు. రోజువారిగా ప్రజల నుండి వచ్చే ఆర్జీలను సంబంధింత శాఖలకు పంపించి త్వరితగతిన పరిష్కారం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాలంటీర్లు ప్రతీ నెల మొదటి తేది ఉదయమే అర్హులైన పెన్షన్‌దారులకు పింఛన్లు అందించాలని కలెక్టర్ డిల్లీరావు అన్నారు.
నిరాశ్రయుల అవాస గృహన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్:
రాణిగారి తోటలో సబ్‌వేవద్ద నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరాశ్రయుల అవాస గృహన్ని తనిఖీ చేసి అక్కడ అసలైన నిరాశ్రయలు లేకపోవడం పట్ల నిర్వహకులపై కలెక్టర్ డిల్లీరావు అగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలనే లక్ష్యానికి విరుద్దంగా అనర్హులు అవాస గృహంలో ఆశ్రయం కల్పిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ డిల్లీరావు హెచ్చరించారు.