జన సంక్షేమమే జగనన్న ప్రభుత్వ లక్ష్యం… : మంత్రి జోగి రమేష్

మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త :
జన సంక్షేమమే జగనన్న ప్రభుత్వ లక్ష్యమని, ఎటువంటి అవినీతికి తావు లేకుండా వివిధ సంక్షేమ ఫలాలు ప్రజలకు నేరుగా అందించడమే తమ ముఖ్య విధి అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు.
మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గం పెడన పురపాలక పరిధిలో 17 వార్డులోని గూడూరు రోడ్డు రైల్ గేట్ తదితర ప్రాంతాలు, 6 వ సచివాలయం పరిధిలో 7 క్లస్టర్లలో సుమారు 350 గృహాలను మంత్రి జోగి రమేష్ సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తున్న మంత్రికి ప్రతి ఇంటి వద్ద ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు లభించాయో లేదో తెలుసుకొంటూ, ఇప్పటివరకు అందిన పథకాల తాలూకా నగదు వివరాలు వారికి తెలియచేస్తూ లబ్ధిదారులతో ఓపిగ్గా మాట్లాడి , వారి నుంచి సమాచారం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ, కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా కేవలం అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అందిస్తున్న జగనన్న ప్రభుత్వం దేశానికే ఒక ఆదర్శ రాష్ట్ర మని కొనియాడారు. పేదరికం కారణంగా ఏ విద్యార్థి ఉన్నత చదువులకు దూరం కాకూడదని, చదువుల ఖర్చుతో తల్లిదండ్రులు అప్పులపాలు కాకూడదన్న సమున్నత లక్ష్యంతో జగనన్న విద్యాదీవెనను ప్రభుత్వం ప్రవేశపెట్టి పేదవారికి చదువుకునే అవకాశం కల్పించారన్నారు. భోజనం, వసతి ఖర్చులకూ విద్యార్థులు ఇబ్బంది పడకుండా జగనన్న వసతి దీవెన పథకాన్ని అందిస్తోందని ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు అభ్యసించేవారికి రూ.20 వేల చొప్పున ప్రభుత్వం ఇస్తోందని వివరించారు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని తమ బంగారు భవిష్యత్తు ఏర్పరచుకోవాలన్నారు.
తొలుత మంత్రి జోగి రమేష్ 17 వ వార్డులోని నందం వెంకటేశ్వరరావు ఇంటి వద్ద ఈ కార్యక్రమం ప్రారంభించారు. పోలన వెంకటేశ్వరమ్మ, రెండుచింతల భవాని శంకర్, నందం సీతామహాలక్ష్మి, గుండు వెంకటరమణ, జక్కా వరలక్ష్మి, సైదాలి బేగం, గుడిమెట్ల కృష్ణకుమారి, అమీరున్నీసా, ఎం. డి. షుక్రా బేగం, నారగాని శ్రీనివాస్,యర్రా జయ, షాహెర బేగం, ఎం.డి. ఫాతిమా, కారుపర్తి నాగేశ్వరమ్మ, పుచ్చల పైడమ్మ, బూడిద నాగేశ్వరమ్మ, రెడ్డి లింగమాంబ, సి హెచ్ పట్టాభి, ఏలూరి శ్రీనివాసరావు, పోలన సంధ్యారాణి, కూర్మ జ్ఞానేశ్వరి,వానపల్లి నాగలక్ష్మి ,బొత్త నాగమణి తదితరుల ఇంటికి వెళ్లి మంత్రి జోగి రమేష్ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు వివరాలు తెలిపి ఇప్పటివరకు ఒకొక్క లబ్ధిదారునికి ఎంత మేరకు ఆర్ధిక సహాయం జరిగిందో వివరించారు. ‘ స్థానికంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలేమైనా ఉంటే నాతో నేరుగా చెప్పండని పలువురిని అడిగారు. తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను అక్కడికక్కడే అధికారులకు ఆదేశించి వాటిని అప్పటికప్పుడే పరిష్కరించారు. అశృఫా ఉన్నీసా అనారోగ్యం తో ఇబ్బంది పడుతుందనే విషయాన్నీ గ్రహించిన మంత్రి జోగి రమేష్ ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం 5 వేల రూపాయలను ఆ కుటుంబానికి అందించారు. అలాగే, హారికా అనే విద్యార్థిని ఉన్నత చదువుల కోసం మంత్రి జోగి రమేష్ ఆమెకు 10 వేల రూపాయల ఆర్ధిక సహాయం అందచేశారు.
ఈ కార్యక్రమంలో పెడన మునిసిపల్ ఛైర్మెన్ బళ్ళా జ్ఞాన లింగ జ్యోత్స్నా రాణి, వైస్ ఛైర్మెన్ ఎం.డి. ఖాజా, 17 వ వార్డు కౌన్సిలర్ మట్ల గోపి , 3 వ వార్డు కౌన్సిలర్ బళ్ళా గంగయ్య, పెడన మునిసిపల్ కమీషనర్ ఎం. అంజయ్య, పెడన మునిసిపాలిటీ ఫ్లోర్ లీడర్ కటకం ప్రసాద్, కటకం నాగకుమారి , వైస్సార్ సీపీ పెడన పట్టణ అధ్యక్షులు బండారు మల్లిఖార్జునరావు, ఆహార సలహా కమిటీ ఛైర్మెన్ హనీఫ్ ఖాన్, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు దాన భైరవ లింగం, మతిన్ , ఎం. డి. హఫీజ్, శిరివెళ్ల వెంకటేశ్వరరావు, స్థానిక ప్రజా ప్రతినిధులు , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు,వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *