తిరుపతి మేయర్, 66 మంది కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారానికి హాజరైన డా. పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త:
తిరుపతి నగరపాలక సంస్థ నూతన మేయర్‌గా మన్యం శ్రీనివాస ప్రసాద్, 66 డివిజన్లకు ఎన్నికైన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యుడు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు డా. పసుపులేటి హరిప్రసాద్ హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మాజీ కేంద్ర మంత్రి, తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పానబాక లక్ష్మి, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, శాప్ చైర్మన్ రవి నాయుడు, యన్.వి. ప్రసాద్, ప్రణీత్ తదితర కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మేయర్, కార్పొరేటర్లకు డా. పసుపులేటి హరిప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. తిరుపతి నగర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రజాప్రతినిధులందరూ సమన్వయంతో కృషి చేయాలని ఆకాంక్షించారు.