గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
స్వచ్చ గుంటూరులో భాగంగా నగరాన్ని సుందరంగా అభివృద్ది చేయడానికి నగరపాలక సంస్థ ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని, అందులో భాగంగా జంక్షన్ ల అభివృద్ధికి కార్యాచరణ సిద్దం చేశామని నగర కమీషనరు కీర్తి చేకూరి ఐ.ఏ.యస్. తెలిపారు. శనివారం కమిషనరు తమ పర్యటనలో భాగంగా కాకాని వై జంక్షన్, పాత గుంటూరు పోలీస్ స్టేషన్ ఎదుట, చిలకలూరిపేట రోడ్ వై జంక్షన్, చుట్ట గుంట జంక్షన్ లను పరిశీలించి, అభివృద్ధి పై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరాన్ని సుందరంగా మార్చడానికి నగరంలోకి వచ్చే ప్రధాన మార్గాల్లో ఉన్న జంక్షన్ల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నామన్నారు. అందులో భాగంగా కాకాని రోడ్ జంక్షన్ లో స్వాతంత్ర్య ఉద్యమంలో జాతిపిత మహత్మా గాంధీ పాల్గొన్న చిత్రాలతో కూడిన 3డి స్ట్యాట్యూను ఏర్పాటు చేయనున్నామని, పనులను కూడా వెంటనే ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే నగరంలోని ఇతర జంక్షన్ లను కూడా త్వరలో వివిధ ఆకృతులతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. పర్యటనలో ఎస్.ఈ. పి.వి.కె.భాస్కర్, ఏ.డి.హెచ్. రామారావు, డి.ఈ.ఈ.లు శ్రీనివాసరెడ్డి, కళ్యాణ రావు, హనీఫ్, ఏ.ఈ.లు, శానిటరీ ఇన్సెపెక్టర్, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …