గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల సంఘం వారి ఉత్తర్వుల మేరకు ఈ నెల 4 వ తేదీన (ఆదివారం) ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బూత్ లెవల్ అధికారులు వారి పోలింగ్ బూత్ ల యందు ఓటరు కార్డ్ కు ఆధార్ అనుసంధానం చేయడానికి అందుబాటులో ఉంటారని నగర కమిషనర్ మరియు ఎలక్టోరల్ రిజిస్టార్ ఆఫీసర్ (ఈ.ఆర్.ఓ.) కీర్తి చేకూరి ఐఏఎస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్ ఆదేశాల మేరకు గుంటూరు పశ్చిమ(94)మరియు తూర్పు (95)నియోజకవర్గాల పరిధిలో ఓటర్లకు ఆధార్ అనుసంధానం కోసం బి.ఎల్.ఓ.లు తమ పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంటారన్నారు. ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఓటు కార్డ్ కు ఆధార్ ను అనుసంధానం చేసుకోవాలని కోరారు. అలాగే పోలింగ్ కేంద్రానికి రాకుండా కూడా ఓటర్లు ఆన్ లైన్ లో ఓటర్ హెల్ప్ లైన్, ఎన్.వి.ఎస్.పి. యాప్ లను డౌన్ లోడ్ చేసుకొని నేరుగా ఓటు కార్డ్ కు ఆధార్ ను అనుసంధానం చేసుకోవచ్చని తెలిపారు.
Tags guntur
Check Also
అద్భుతమైన, డిజైన్ ఆధారిత ఉత్పత్తి శ్రేణితో AP NAREDCO ఎక్స్‌పోలో ప్రత్యేక ముద్ర వేసిన రీజెన్సీ సెరామిక్స్
-ఎక్స్‌పోలో రీజెన్సీ సిరామిక్స్ ఆవిష్కరణలను NAREDCO ప్రెసిడెంట్ జి హరిబాబు ప్రశంసించారు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సెరామిక్స్ …