డిసెంబర్‌ మాసాంతరానికి 15 వేల గృహా నిర్మాణాల లక్ష్యాన్ని సాధించండి…

-వారం వారిగా లక్ష్యాలను నిర్థేశించుకుని 15 వారాల్లో పనులను పూర్తి చేయండి…
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న కాలనీలలో డిసెంబర్‌ మాసాంతరానికి 15 వేల గృహనిర్మాణాలను పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని సాధించాలని వారం వారం లక్ష్యాలను నిర్థేశించుకుని రానున్న 15 వారాలలో పనులు పూర్తి చేసేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు యంపిడివోలు, హౌసింగ్‌ అధికారులను ఆదేశించారు.
జిల్లాలో గృహ నిర్మాణాల ప్రగతిపై శనివారం ఉదయం జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు ఆయన కార్యాలయం నుండి గూగుల్‌ కాన్స్‌రెన్స్‌ నిర్వహించారు. ఉదయం 10:30 నుండి 12:30 వరకు రెండు గంటల పాటు ప్రతి లేఅవుట్‌లో ప్రగతిపై జిల్లా కలెక్టర్‌ అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించి నిర్మాణాలను పూర్తి చేసేలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహ నిర్మాణ పథకం ద్వారా ప్రతి పేదవారికి సొంత ఇంటి కల నెరవేర్చాలన్న లక్ష్యాన్ని నెరవేర్చవలసిన భాధ్యత మండలాభివృద్ధి అధికారులు గృహ నిర్మాణా శాఖ ఇంజనీరింగ్‌ అధికారులపై ఉందన్నారు. ఇప్పటివరకు పూర్తి చేసిన గృహాలకు అదనంగా డిసెంబర్‌ మాసాంతరానికి 15 వేల గృహ నిర్మాణాలను ఎట్టిపరిస్థితులలోను పూర్తి చేసి లబ్దిదారులు గృహాప్రవేశం చేయించే భాధ్యత మీ పై ఉందన్నారు. బిలో బేస్మింట్‌ లెవల్‌, బేస్మింట్‌ లెవల్‌, రూఫ్‌ లెవల్‌, రూఫ్‌ కాస్టింగ్‌ లెవల్‌కు తీసుకువచ్చి నిర్మాణాలను పూర్తి చేసేందుకు లక్ష్యాలను నిర్థేశించుకోని అమలు చేయాలన్నారు. వారం వారిగా నిర్థేశించుకున్న లక్ష్యాలను పూర్తి చేయడంపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలన్నారు. విజయవాడ నగర పాలక సంస్థ కొండపల్లి, తిరువూరు నందిగామ జగ్గయ్యపేట మున్సిపాలిటిలలో బేస్మింట్‌ లెవల్‌, రూఫ్‌ లెవల్‌, రూఫ్‌ కాస్టింగ్‌ లెవల్‌లో ఉన్న సుమారు 5వేల గృహాలను పూర్తి చేయలన్నారు. ఇందులో విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 3500 గృహాలను వారానికి 200 గృహాల చొప్పున కొండపల్లి మున్సిపాలిటి పరిధిలో సుమారు 1400 గృహాలను వారానికి 90 చొప్పున తిరువూరు మున్సిపాలిటి పరిధిలో 280 గృహాలను వారానికి 20 చొప్పున నందిగామ మున్సిపాలిటి పరిధిలో 380 గృహాలను వారానికి 22 చొప్పున జగ్గయ్యపేట మున్సిపాలిటి పరిధిలో 188 గృహాలను వారానికి 13 చొప్పున పూర్తి చేసేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 11 మండలాలకు సంబంధించి బేస్మింట్‌ లెవల్‌, రూఫ్‌ లెవల్‌, రూఫ్‌ కాస్టింగ్‌ లెవల్‌లో ఉన్న 10 వేల గృహాలను పూర్తి చేయలన్నారు. ఇందులో మైలవరం మండలంలో 1800 జి. కొండూరు మండలంలో 1200, కంచికచర్లల మండలంలో 1000, నందిగామలో 900, చందర్లపాడు మండలంలో 750, పెనుగంచిప్రోలు మండలంలో 600, వత్సవాయి మండలంలో 674, వీరులపాడు మండలంలో 550, జగ్గయ్యపేట మండలంలో 300 విజయవాడ రూరల్‌ మండలంలో 2,296 గృహాలను 15 వారాలలో పూర్తి చేయాలన్నారు. వారం వారిగా నిర్థేశించుకున్న లక్ష్యాన్ని సాధించడంలో లోటు ఉన్నట్లయితే తదుపరి వారంలో లక్ష్యంతో కలిపి తప్పనిసరిగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. లక్ష్యాల సాధించడంలో స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు లబ్దిదారులు మేదోమదనం చేసుకుని పనులను పూర్తి చేయాలన్నారు. లేఅవుట్‌లలో ఎదురయ్యే సమస్యలను చెక్‌లిస్ట్‌ చేసుకుని పరిష్కార మార్గలను అన్వేషించుకుని పనులను పూర్తి చేయాలన్నారు. వారం వారిగా నిర్థేశించిన లక్ష్యాలను సాధించడంలో అలసత్యం వహిస్తే ఉపేక్షించబోనన్నారు. నిర్థేశించిన లక్ష్యాన్ని సవాల్‌గా తీసుకుని పనులు పూర్తి చేయడంలో పోటీ తత్వాన్ని కనపర్చాలని కలెక్టర్‌ డిల్లీరావు తెలిపారు.
కాన్ఫరెన్స్‌లో హౌసింగ్‌ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌ వి శ్రీదేవి, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు రవికాంత్‌, విజయబాబు,ఖాజావలి, రాంప్రసాద్‌, మల్లేశ్వరరావు, మున్సిపాలిటి కమీషనర్లు, యంపిడివోలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *