విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వినాయక చవితి పండుగ సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో పలుచోట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు ఏర్పాటూ చేసిన వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీస్సులు అందుకొన్న నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్.తదనంతరం నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలను ప్రారంభించి అన్నవితరణ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయం లను ప్రతిబించేలా జరిపే ఈ పండుగలు మనలో ఐక్యమత్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు.అందరూ కలిసికట్టుగా సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో 4వ డివిజన్ ఇంచార్జ్ గల్లా పద్మావతి,11వ డివిజన్ ఇంచార్జ్ రమాయణపు శ్రీనివాస్,వైస్సార్సీపీ నాయకులు గల్లా రవి, కోలా ఉమా,బొడ్డు తరుణ్,హరీష్,సాయి నాయుడు,ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
సీఎం చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిసిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : హనుమయ్య కంపెనీ ప్రాంగణంలో శుక్రవారం నారెడ్కో ప్రాపర్టీ షో ప్రారంభానికి హాజరైన రాష్ట్ర …