చిత్తూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పెనుమూరు మం డలం మరియు గ్రామమజరా తిమ్మరాజు కండ్రిగ గ్రామ కాపురస్తులైన పి.రత్నం భూ విష యానికి సంబంధించి విచారణ అధికారిగా డిఆర్ఓ ను నియ మిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ యం.హరి నారాయణన్ ఆది వారం ఒక ప్రకటన లో తెలిపారు.
పెనుమూరు మం డలం మరియు గ్రామమజరా తిమ్మరాజు కండ్రిగ గ్రామ కాపురస్తులైన పి.రత్నం భూ విష యం నకు సంబంధిం చిన వాస్తవ అంశాలు…
పి.రత్నం అనువారు పెనుమూరు రెవిన్యూ గ్రామ లెక్కధాఖలో స.నెం. 918/4 విస్తీర్ణం 2.52 సెంట్లు భూమి తన పేరిట మార్పు చేయమని కోరుతూ అర్జీ సమర్పించి యున్నారు. కానీ సదరు భూమి A-రిజిస్టర్ ప్రకారం స.నెం. 918 విస్తీర్ణం 9.28 సెంట్లు ఫారెస్ట్ రిజర్వ్ గా నమోదు కాబడి ఉన్నది. సదరు భూమిలో ఇతను కూడా పక్కాభవనం కల్గియున్నారు. వీరిపై 1974 సంవత్సరంలోస.నెం.918/4 విస్తీర్ణం 2.52 ఎకరాల భూమికి ఏక్ సాల్ పర్మిషన్ పొందినట్లు, సదరు భూమికి DKT పట్టా మంజూరు చేయవలెనని కోరియున్నారు. ఈ భూసమస్య 1974వ సంవత్సరంనుండి కలదు.ఏక్ సాల్ పర్మిషన్ పొందినట్లు వీరు తెలియ జేస్తు న్నారు ఇతనికి మంజూరు చేసినట్లు కార్యాలయపునందు రికార్డులో నమోదు కాలేదు.ఇతను సాగు చేస్తునట్లు గ్రామ లెక్కలలో ఎలాంటి నమోదు లేదు.ఫారెస్ట్ భూమి లో పట్టా ఇవ్వలేమ ని అప్పటి అధికారు లు ప్రత్యామ్నాయ ముగా వీరికి తాతి రెడ్డి పల్లి రెవిన్యూ గ్రామంలో స.నెం.46/1,46/2 విస్తీ ర్ణంలు వరుసగా 2.07 మరియు 2.50 ఎకరాలు భూమిని దరఖాస్తు పట్టా ఇవ్వగా వీరు డి సి సి బి నందు ఋణం పొంది, చెల్లించనందుకు వేలం వేసియున్నారు. మరియు అప్పటి ఫారెస్ట్ అధికారులు మరియు రెవిన్యూ అధికారుల నివేదిక ఆధారంగా అప్పటి కలెక్టరు గారి అదేశములపై అప్పటి తహసీల్దారు గారు VHS/2/1417, dt: 04.04.2008 న 25 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలు పై స్థలంలో మంజూరు చేసియున్నారు. సదరు లబ్ధిదారులు పక్కా గృహాలను ప్రభుత్వము నుండి పొంది నివాస ముం టున్నారు.
సర్వేనెంబర్ 918 కి సంబంధించి 2.75 ఎకరా లలో ఇండ్లు, 0.60 ఎకరాలలో ప్రభుత్వ భవనాలు, 2.13 ఎకరాలు ఇతరుల ఆధీనంలో గల సాగు భూమి, 0.64 ఎకరాలు పెను మూరు టు పూతల పట్టు ఆర్ & బి రోడ్, 3.06 ఎకరాలు సాగుకు ఉపయుక్తం కాని భూమి, 0.10 ఎకరాలు దేవస్థానం కలదని చిత్తూరు రెవెన్యూ డివిజనల్ అధికారి నివేదిక ఇవ్వడం జరిగింది.
వీరు అర్జీ నందు కన పరిచిన పెనుమూరు గ్రామ లెక్క ధాఖల లో స.నెం.918/4 విస్తీర్ణం 2.52 సెంట్లు భూమికి గౌరవ ప్రిన్సి పల్ జూనియర్ సివిల్ జడ్జి గారికోర్టు, చిత్తూరు నందు O.S No.704/2008 తో దావావేసి 2016 సంవత్సరములో సదరు భూమిపై పర్మినెంటు ఇంజెక్షన్ పొందియున్నారు. సదరు కోర్టు ఆర్డరు ను అమలు చేయా లని కోరియున్నారు. సదరు సర్వే నెంబరు విషయము గానే లో కా యుక్త -ఆంధ్ర ప్రదేశ్ నందు Complaint No.3646/2017/B2 తో మరియు E.P No.04/2021, మరియు O.S.No.704/2008 ప్రకారం గౌరవ Prl.Jr.Civil Judge కోర్టు నందు, జిల్లా న్యాయసేవ అథారిటీ చిత్తూరు వారి వద్ద వీరు వేసి యున్న వ్యాజ్య ములు పెండింగ్ లో ఉన్నవి.
డి ఆర్ ఓ విచారణ నివేదిక ఆధారంగా బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని కలెక్టర్ తెలిపారు..