విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
నగర పర్యటనలో భాగముగా నగర పాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్, పాలిటెక్నిక్ కాలేజి ప్రాంతములో ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయుటకు నిర్దేశిoచబడిన సర్వీసు రోడ్ ను పరిశీలించి సదరు రోడ్ నందు గుంటలు ఉండుట గమనించి వెంటనే ప్యాచ్ వర్క్ పనులు చేపట్టవలసినదిగా సంబందిత ఇంజనీరింగ్ శాఖాదికారులను ఆదేశించినారు. అదే ప్రాంతములో డ్రైన్ ల వెంబడి స్విప్పింగ్ మిషన్ ద్వారా శుభ్రపరచాలని మరియు డివైడర్ స్టోన్స్ అక్కడక్కడ పగిలిపోవుట గమనించి వెంటనే వాటి స్థానములో కొత్తవి ఏర్పాటు చేయాలని సూచించారు. తదుపరి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఎదురుగా గల గ్రీన్ బెల్ట్ కు ఫెన్సింగ్ ఏర్పాటు చేయవలసినదిగా ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అనoతరం 3వ డివిజనులో పర్యటిస్తూ గుత్తికొండ ధనుంజయరావు వీధిలో ప్యాచ్ వర్కులు నిర్వహించాలని సూచించారు. పంట కాలువ రోడ్ లో భూగర్భ డ్రైనేజి వ్యవస్థ ను పరిశీలించి, ఎమినిటి, ప్లానింగ్ మరియు శానిటరీ సెక్రటరీల ద్వారా భూగర్భ డ్రైనేజి కలిసే పాయింట్లను గుర్తించి, శానిటరీ సెక్రెటరిల ద్వారా ఆ పాయింట్లను శుబ్రపరచుటకు చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. విజయవాడ నగర సరిహద్దులలో దూరప్రాంతముల నుండి నగరానికి వచ్చు ప్రజల కొరకు సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని పట్టణ ప్రణాళిక విభాగపు అధికారులకు ఆదేశించారు. పర్యటనలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …