Breaking News

చిన్నారులు కిశోర బాలలు గర్భిణీలు బాలింతల ఆరోగ్యపై ప్రత్యేక దృష్టి…

-ఆరోగ్యవంతమైన బిడ్డల ఎదుగుదలకు సంపూర్ణ పౌష్టికాహారం అవసరం…
-పౌష్టికాహారం ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజం…
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
చిన్నారులు కిశోర బాలలు గర్భిణీలు బాలింతల ఆరోగ్యపై ప్రత్యేక దృష్టి పెట్టి పోషణమహా కార్యక్రమంలో పోష్టికాహారంపై అవగాహన కల్పించడం ద్వారా ఆరోగ్యవంతమైన బిడ్డల ఎదుగుదలకు కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు.
స్త్రీ శిశు సంక్షేమ ఆధ్వర్యంలో జిల్లాలో నెల రోజుల పాటు నిర్వహించనున్న పోషణమహా కార్యక్రామంలో భాగంగా శుక్రవారం నందిగామ ఐసిడిఎస్‌ ప్రాజెక్టులో నిర్వహించిన మహిళలకు వైద్య పరీక్షలు, సీమంతం, చిన్నారులకు అన్నప్రాసన్న ఊయ్యాల వేడుక కార్యక్రమాలకు జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మహిళ గర్భం దాచిన నాటి నుండి శిశువుకు జన్మనించేతవరకు సుమారు 36 వారాల పాటు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించుకుని అవసరమైన పోష్టికాహారన్ని తీసుకున్నపుడే ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మను ఇవ్వగలుగుతారన్నారు. ప్రతి నెల క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాల్సిన భాధ్యత అంగన్‌వాడీ సుపర్‌వైజర్లపై ఉందన్నారు. పుట్టిన నాటి నుండి ఆరు నెలల పాటు ఒక కేటగిరి, 7 నెల నుండి 3 సంవత్సరాల వరకు రెండవ కేటగిరి, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల వరకు మూడవ కేటగిరిగా పిల్లలను గుర్తించి అనుగుణంగా పోష్టికాహారాన్ని అందించనున్నట్లు ఆయన తెలిపారు. గర్భిణిలు బాలింతలు రక్తిహీనత వలన అనేక రుగ్మతులను ఎదురుకోవాల్సి వస్తుందన్నారు. సంపూర్ణ పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా రక్త హీనతను ఎదుర్కోగలుగుతారన్నారు. చిన్నారలు కిశోర బాలలు గర్భిణిలు బాలింతులకు సరైన సమయంలో సరైన పోష్టికాహారాన్ని అందించావలసిన భాధ్యత శ్రీ శిశు సంక్షేమం పై ఉందన్నారు. వైఎస్సార్‌ పోషణ క్విట్ల ద్వారా 6 రకాల పోషణ పద్దార్థాలను బాలామృతాన్ని పంపిణీ చేస్తున్నామని వాటిని మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గర్భిణి స్త్రీలకు గుర్తించి వారి కుటుంబ సభ్యులతో సమావేశం నిర్వహించి పోష్టికాహారం పై అవగాహన కల్పించాలన్నారు. గర్భిణీ సమయంలో యోగా, మెడిటేషన్‌ పై శ్రద్ద పెట్టి వాటిని ఆచరించడం ద్వారా ఆరోగ్యంతోపాటు బిడ్డలకు మానసిక ఎదుగుదలకు ఎంతో తోడ్పడుతుందన్నారు. పోషణమహా కార్యక్రమం ద్వారా నెల రోజులపాటు జిల్లా వ్యాప్తంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు రక్తహీణత, పరిశుభ్రత, సంపూర్ణ పోషణ, పౌష్టికాహారంపై అవగాహన కల్పించి పౌష్టికాహార లోప రహిత జిల్లాగా తీర్చిదిద్దనున్నామని ఆయన తెలిపారు. పోషణమహా కార్యక్రమంలో భాగంగా ర్యాలీలు, 2కె రన్‌, పోషణపై అవగాహన, పౌష్టిక ఆహార కిట్ల పంపిణీ, పోషణ అబియాన్‌ రిజిస్ట్రేషన్‌లను నిర్వహిస్తున్నామన్నారు. కమ్యూనిటీ ఈవెంట్‌లో భాగంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు, ఎర్లీ చైల్డ్‌ కేర్‌, కిచెన్‌ గార్డెన్‌లపై అవగాహన, గర్భవతులు బాలింతలకు రక్తిహీణతపై ఆరోగ్య పరీక్షలు, రుతు సమయంలో పరిశుభ్రతపై కిశోరబాలికలకు అవగాహన, స్వచ్ఛతపై క్విజ్‌, డ్రాయింగ్‌ పోటీల మురికివాడలలోని అంగన్‌వాడీ సేవలపై అవగాహన, రక్తహీనత, రోగనిరోద టీకాలపై అవగాహన, ఆయుష్‌ డిపార్టమెంట్‌ ద్వారా పంచాయతీలలో యోగా తరగతుల చిరుదాన్యాలతో పౌష్టికాహారం తయారీపై పోటీలు, వెల్‌బేబి షో వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు తెలిపారు.
పోషణమహా కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన సంతాకల సేకరణలో జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు సంతకం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి వైద్య పరీక్షలను పరిశీలించి మహిళలకు సీమంతం చిన్నారులకు అన్నప్రాసన ఉయ్యాల వేడులు నిర్వహించారు. కార్యక్రమంలో డిఆర్‌వో ఏ. రవీంద్రరావు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌ జి. ఉమాదేవి, సిడిపివోలు వి.భాగ్యరేణుక, జె.లక్ష్మి భార్గవి, కె. గ్లోరి, ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డా. టి.రవి, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *