విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి పెంపొందించి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సమగ్ర నైపుణ్య శిక్షణ ప్రణాళికను రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు.
డిస్టిక్ స్కిల్ డెవలప్‌మెంట్ కమిటీ సమావేశం శుక్రవారం నగరంలోని కలెక్టరేట్ నుండి కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు కమిటీ సభ్యులతో గూగుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ సంస్థలలో రంగాల వారిగా అవసరమైన ఉద్యోగాల వివరాలను విశ్లేషించాలని డిమాండ్‌కు అనుగుణంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించాలన్నారు. నైపుణ్యాభివృద్ధి అవసరం ఉన్నవారి వివరాలను ప్రత్యేక యాప్ ద్వారా నమోదు చేసుకుని శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా అధికారులు ఆలోచన చేయాలని కలెక్టర్ అన్నారు. సాంకేతిక విద్య అయిన బి టెక్, పాలిటెక్నిక్, ఐటిఐ కోర్సులు చదివిన వారికి ఆయా కళాశాలలో క్యాంపస్ ఇంటర్వుల ద్వారా నియామకాలు జరుగుతున్నాయని సభ్యులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. నాన్ టెక్నికల్ కోర్సులైన బిఏ, బికామ్, బిఎస్‌సి, వంటి కోర్సులు చదివిన వారికి కూడా కమ్యూనికేషన్ స్కిల్స్, నైపుణ్యాభివృద్ధికి శిక్షణ ఇచ్చి వివిధ కంపెనీలలో ఉద్యోగా అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఉన్న వివిధ పరిశ్రమలలో అవసరమైన ఉద్యోగ ఖాళీలు నిరుద్యోగ యువతతో పూరించేలా చర్యలు తీసుకోవాలని పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్‌ను కలెక్టర్ ఆదేశించారు. కళాశాలలో జాబ్ మేళాలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సభ్యులను కలెక్టర్ కోరారు. కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న స్కిల్ ఎక్విజేషన్ అండ్ నాలెడ్జి అవేర్నెస్ ఫర్ లైవ్లిహుడ్ ప్రమోషన్ (సంకల్ప్) కార్యక్రమం ద్వారా వివిధ అంశాలలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని కలెక్టర్ డిల్లీరావు ఆదేశించారు.
కాన్ఫరెన్స్‌లో కమిటీ కన్వినర్ డిస్టక్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ డా. పివి రమేష్ కుమార్, డిస్టిక్ స్కిల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ కో కన్వినర్ డా. పి నరేష్‌కుమార్, యూత్ వెల్ఫెర్ ఆఫీసర్ శ్రీనివాస్‌రావు, సభ్యులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …