కొవ్వూరు, నేటి పత్రిక ప్రజా వార్త :
రెవెన్యూ డివిజన్ అధికారి వారి నివాస భవనం పనులు నాణ్యత తో కూడి త్వరితగతిన పూర్తి చెయ్యాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం కొవ్వూరు ఆర్డీవో కార్యాలయం రికార్డు రూమ్ ను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ఆర్డిఓ కార్యాలయం లో ఉన్న ప్రతి ఒక్క భూ సంబంధ, తదితర రికార్డులను స్కాన్ చేసి భద్రపరచడం కోసం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆర్డీవో కార్యాలయంలో వివిధ విభాగాలను పరిశీలించారు. స్పందన ఫిర్యాదులు, ఇతర కార్యాలయ సిబ్బంది క్యాడర్ స్ట్రెంధ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. తదుపరి ఆర్డీవో కార్యాలయం ఆవరణలో నిర్మాణంలో ఆర్డీవో అధికారి నివాస భవనం పనులపై సమీక్షించారు. త్వరితగతిన భవనం నిర్మాణం పూర్తి చేసెందుకు చర్యలు తీసుకోవాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు. నాణ్యత కలిగిన విధంగా పనులు పూర్తి చేయాలన్నారు. ఆర్డీవో ఎస్. మల్లిబాబు, హౌసింగ్ ఈ ఈ సిహెచ్. బాబురావు, ఏ వో జవహర్ బాజి, తదితరులు ఉన్నారు.
Tags kovvuru
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …