-జూమ్ సమావేశంలో పాల్గొన్న మొదటి అదనపు జిల్లా జడ్జి కే.సునీత
-భ్రూణ హత్యలను తీవ్రంగా పరిగణించడం జరుగుతుంది
-డేకాఇట్ ఆపరేషన్ చేపట్టి ఉల్లంఘన చేసే వారిని గుర్తించాలి
-కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజా వార్త :
సమాజం ఇంతగా అభివృద్ధి సాధించినా ఇంకా భ్రూణ హత్యలు జరగడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత అన్నారు. స్కాన్, డయోగ్నిటిక్ కేంద్రాలు, ఆసుపత్రులు, డాక్టర్లు ఎంతమాత్రం ఇటువంటి వాటిని ప్రోత్సహించ రాదన్నారు.
శుక్రవారం పి ఎన్ డి టి యాక్ట్ 1994 పై తొలి జిల్లా స్థాయి బహుళ సభ్యులు మరియు జిల్లా సలహా కమిటీ సమావేశం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు. మొదటి అదనపు జిల్లా జడ్జి కే.సునీత జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, ఆది గర్భస్థ పిండ పరీక్ష ప్రక్రియ లో ప్రభుత్వ మార్గదర్శకాల ఉల్లంఘన వంటి ఘటనల్లో చట్టాలు చాలా కఠినంగా శిక్షలు వెయ్యడం జరుగుతుందన్న విషయం ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. భ్రూణ హత్యలకు సంబంధించి చట్టాలు ద్వారా అమలు చేస్తున్న శిక్షలు, తదితర అంశాలపై స్లైడ్ షో ద్వారా సినిమా థియేటర్ లు, కేబుల్ నెట్ వర్క్, సామాజిక మాధ్యమాల్లో విస్తృత స్థాయిలో ప్రచారం చెయ్యాలన్నారు. సామాజికంగా, సాంకేతిక పరంగా అభివృద్ధి చెందుతున్నా, ఇంకా భ్రూణ హత్యలు జరగడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ఉన్నత విద్యా వంతులు కూడా మూడు నాలుగు సార్లు అబార్షన్ చేసుకోవడం ద్వారా ఆడపిల్లల ఆరోగ్యం ఎంతగా క్షీణించడం జరుగుతుందో అవగాహన కల్పించే సామాజిక బాధ్యత ఉందన్నారు. వివిధ మాధ్యమాల్లో ప్రజలకు అవగాహన కల్పించే ప్రచారం విస్తృతంగా చెయ్యాల్సి ఉందన్నారు. ఆడపిల్ల అయినా, అబ్బాయి అయినా ఒక్కటే అనే భావం కల్పించాల్సి ఉందన్నారు. ఆడపిల్లలు అన్నింటా ముందు ఉంటున్నారని, రాష్ట్ర ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలు, కార్యక్రమాల అమలు లో పెద్ద ఎత్తున మహిళలను భాగస్వామ్యం చేస్తూ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న విషయం కలెక్టర్ ప్రస్తావించారు . జిల్లాలో అబార్షన్లు పై అధ్యయనం చేసి, సమగ్ర నివేదికను రూపొందించుకుని సదరు సమావేశం నాటికి సమగ్ర నివేదికను ఇవ్వాలన్నారు. ఉన్నత విద్యా వంతులు కూడా మూడు నాలుగు సార్లు అబార్షన్ చేసుకోవడం ద్వారా ఆడపిల్లల ఆరోగ్యం ఎంతగా క్షీణించడం జరుగుతుందో అవగాహన కల్పించే సామాజిక బాధ్యత ఉందన్నారు. వివిధ మాధ్యమాల్లో ప్రజలకు అవగాహన కల్పించే ప్రచారం విస్తృతంగా చెయ్యాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఆడపిల్ల అయినా, అబ్బాయి అయినా ఒకటే అనే భావం కల్పించాల్సి ఉందన్నారు. దిశా, మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా సమన్వయం చేసుకుంటూ పోలీసు అధికారులు ద్వారా డేకాఇట్ ఆపరేషన్ చెయ్యడం పై కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని కమిటీ సమావేశంలో నిర్ణయించారు. దిశా, మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా సమన్వయం చేసుకుంటూ పోలీసు అధికారులు ద్వారా డేకాఇట్ ఆపరేషన్ చెయ్యడం పై కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని కమిటీ సమావేశంలో నిర్ణయించారు.ఈ సమావేశానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఐ సి డి ఎస్ అధికారులను కూడా కమిటీ లో భాగస్వామ్యం చెయ్యాల్సి ఉందన్నారు.
కన్వీనర్ మెంబర్ కార్యదర్శి, డి ఎమ్ హెచ్ ఓ డా ఎన్. వసుంధర మాట్లాడుతూ, గర్భిణి స్త్రీలు తమ బిడ్డ ఆరోగ్య పరిస్థితి కోసం డయోగ్నిటిక్ కోసం మాత్రమే స్కాన్ కోసం అని ధృవీకరించాల్సి ఉందన్నారు. జిల్లాలో గత ఆరు నెలల సెక్స్ రేషియో ప్రతి వెయ్యకు 903 గా ఉందని, అయితే ఏడాదిలో జన్మించే పిల్లలు ఆధారంగా గణాంకాలను పరిగణన లోకి తీసుకొనవలసి ఉందన్నారు. జిల్లాలో 13 ప్రభుత్వ, 122 ప్రవేటు స్కానింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. మరో రెండు అల్ట్రా స్కానింగ్ జనటిక్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. స్కానింగ్ కేంద్రాలు ఉల్లంఘిస్తే వాటి లైసెన్స్ రద్దు చేస్తామని, ఇదే విషయంలో డాక్టర్లు భాగస్వామ్యం అయితే తొలి సారి రూ.30 వేలు జరిమానా విధించడం జరుగుతుందన్నారు. ఇదే పునవృతం ఐతే వారి గుర్తింపు రద్దు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి కమిటీ సమావేశం నిర్వహించడం, ప్రతి నెల మొదటి శుక్రవారం సభ్యులు సమావేశం నిర్వహించి చర్చిస్తామన్నారు .
ఈ సమావేశంలో అదనపు ఎస్ పి సిహెచ్. పాపారావు, గైనకాలజిస్ట్ డా జీ. ప్రమీల, పిడియాట్రిషియన్ , డివిజనల్ పిఆర్ఓ యం. లక్ష్మణా చార్యులు, దిశా పోలీస్ స్టేషన్ అధికారి గౌస్ బెగ్, స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధి, తదితరులు పాల్గొన్నారు.