విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు క్రీడావిద్యార్థులకు పిలుపునిచ్చారు.
కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ ఈ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్లు, క్లబ్బుల వివరాలు, ఆర్థిక సహాయం వంటి క్రీడా కారులకు అవసరమైన పలు వివరాలు అందుబాటులో ఉంటాయన్నారు. జగనన్న స్పోర్ట్స్ క్లబ్ యాప్‌ను క్రీడాకారులు, క్రీడా విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫీసర్ యు. శ్రీనివాసరావు, ఛీఫ్ కోచ్ అజీజ్, స్పోర్ట్స్ ఆథారిటీ కోచ్‌లు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …