-ఉన్నతస్థాయి నుండి అనుమతులకు ప్రయత్నిస్తాం…
-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
జిల్లాలో జరుగుతున్న జగనన్న లేఅవుట్లలోని గృహా నిర్మాణ పనులలో పూడికకు పోలవరం ప్రాజెక్టు ప్రాంతం నుండి మట్టిని తరలించే ఆలోచన చేస్తున్నామని, లేఅవుట్ల దగ్గర ప్రాంతాలలోని కొండ ప్రాంతాల నుండి కూడా మట్టిని తరలించేందుకు చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ డిల్లీరావు తెలిపారు.
నగరంలోని కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ డిల్లీరావు మైనింగ్, హౌసింగ్, పోలవరం ప్రాజెక్టు ఇంజనీర్లతో మట్టిని తరలించే ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న లేఅవుట్లలో పూడికకు సంబంధించి మట్టిని తరలించేందుకు పరిశీలిస్తున్నామని పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలోని మట్టిని తరలించేందుకు యోచిస్తున్నామని ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయ స్థాయిలో అనుమతులు కోరుతామని, దీనిపై సంబంధిత శాసనసభ్యులతో త్వరలో సమావేశం నిర్వహిస్తామన్నారు. తూర్పు గోదావరి జిల్లా పురుషోత్తమపట్నం ప్రాంతం నుండి మట్టిని తరలించే విధంగా అధికారులు ఆలోచన చేయాలన్నారు. ఈ మేరకు మైనింగ్ హౌసింగ్ అధికారులు విధి విధానాలు పరిశీలించాలన్నారు. తరలింపుకు అయ్యే ఖర్చులు రవాణా తదితర అంశాలపై చర్చించిన అనంతరం విజయవాడ మున్సిపల్ కమీషనర్, హౌసింగ్ అధికారులు సూచనలు మేరకు లేఅవుట్ల
దగ్గరప్రాంతాల నుండి తరలించేందుకు పరిశీలించాలని నున్న జగనన్న లేఅవుట్ల దగ్గర్లోని సూరంపల్లి కొండప్రాంతం నుంచి, జక్కంపూడి లేఅవుట్లకు వెలగలేరు ప్రాంతం నుండి తరలించేందుకు సాద్యాసాద్యాలను పరిశీలించాలని కలెక్టర్ అన్నారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్, విజయవాడ మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్, పోలవరం ఐదవ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె. శ్రీనివాసరావు, హౌసింగ్ పిడి శ్రీదేవి, హౌసింగ్ ఈఈ రవికాంత్, డిడి మైన్స్ సుబ్రహ్మణ్యేశ్వరరావు ఉన్నారు.