విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్ నందు ఎపిసిసి లీగల్ సెల్ ఛైర్మన్ వలిబోయిన గురునాధంని ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్ (ఎ. ఐ. జి.డి.యస్.యు.) జాతీయ మాజీ అధ్యక్షుడు బి.వి.రావు శనివారం కలిసి గ్రామీణ డాక్ సేవకుల కోసం చేసిన కృషికి కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో గ్రామీణ డాక్ సేవకులను (పోస్ట్ ఆఫీస్ యూనియన్) వీరిని శాశ్వత ఉద్యోగులుగా పరిగణించాలని ఏపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ వలిబోయిన గురునాధం గారు రాష్ట్రపతి కార్యాలయానికి లేఖ రాయడం జరిగింది.. ఈ లేఖ పై భారత రాష్ట్రపతి కార్యాలయం స్పందించి కేంద్ర ప్రభుత్వ కార్యాలయ కార్యదర్శికి ఈ సమస్యపై సముచిత దృష్టి సారించమని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సదరు జాతీయ గ్రామీణ డాక్ సేవకుల సమస్యల పరిష్కారం కోసం కర్ణాటకలో సమావేశం జరిపి హక్కుల సాధనకై పోరాటం చేయాలని తీర్మానించారు. అక్టోబరు 19వ తారీఖు 2022న ఢిల్లీలోని డాక్ సేవక్ కేంద్ర కార్యాలయం ఎదుట జరగబోయే ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర ఛైర్మన్ అయిన శ్రీ వలిబోయిన గురునాధం గారిని ప్రత్యేక అతిథిగా ఆహ్వానించి రాష్ట్రపతికి లేఖ రాసినందుకు అభినందించారు. లక్షలాది గ్రామీణ డాక్ సేవకుల భవిష్యత్తుకు సంబంధిత సమస్యలు పరిష్కారం కోసం అక్టోబరు 19వ తారీఖు 2022న ఢిల్లీలోని డాక్ సేవక్ కేంద్ర కార్యాలయం ఎదుట జరగబోయే ఆమరణ నిరాహార దీక్షకు హాజరై తమ పార్టీ మద్దతు ప్రకటించేలా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ గ్రామీణ డాక్ సేవకుల మాజీ అధ్యక్షులు బి.వి.రావు, ఆంధ్రప్రదేశ్ సర్కిల్ నాయకులు వెంకటరావు, జిల్లా సర్కిల్ నాయకులు వి.ఏడుకొండలు, ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించిన తదితర నాయకులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …