వైద్యులందరూ సమయ వేళలు పాటించాలి…

-కేజీహెచ్ లో క్యాజువాలిటీ, భావనగర్ వార్డులను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఇంచార్జి రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్య శాఖామంత్రి విడదల రజని

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజా వార్త :
కేజీహెచ్ లో వైద్యులందరూ సమయ వేళలు పాటించి ఆసుపత్రికి వచ్చే రోగులందరికీ అత్యుత్తమ వైద్య సేవలను అందించాలని జిల్లా ఇంచార్జి, రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్య శాఖామంత్రి విడదల రజని వైద్యులకు సూచించారు ఆదివారం సాయంత్రం మంత్రి జిల్లా కలక్టరు డా.ఎ.మల్లిఖార్జున , ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ లతో కలిసి కేజీహెచ్ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు ముందుగా క్యాజువాలిటీ వార్డుకు చేరుకొని ఓపి సేవలను అడిగి తెలుసుకున్నారు అనంతరం క్యాజువాలిటీ వార్డులో కలియ తిరుగుతూ అక్కడ ఉన్న అత్య వసర రోగులను వారికి అందు తున్న సేవలను అడుగు తెలుసు కున్నారు వార్డులో పని చేస్తున్న డాక్టర్లతో మాట్లాడి కేస్ షీట్ లను పరిశీలించి తగు సూచనలు చేసారు వార్డు పరిసరాలను పరిశీలించారు అక్కడ అందు తున్న వైద్య ఇతర సేవలపై వైద్యు లను ఆరా తీశారు ఆరోగ్య మిత్ర, నర్సులు వార్డులో 24 గంటలు అందుబాటులో ఉండాలన్నారు
అనంతరం భావనగర్ వార్డుకు చేరుకున్నారు అక్కడ బయట నూతనంగా పేషంట్ బంధువులకు ఏర్పాటు చేసిన షెడ్డులను వాటి లో ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు సానిటరీ మరియు భద్రతా సిబ్బంది యొక్క గుర్తింపు కార్డులను తనిఖీ చేసి కార్డులు లేని వారికి ఎందుకు దరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే గుర్తింపు కార్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదే శించారు భద్రతా సిబ్బంది విధిగా సమయ పాలన పాటించాలని అన్నారు అక్కడ ఏర్పాటు చేసిన మంచినీటి యూనిట్ ని మంత్రి పరిశీలించారు వెయిటింగ్ హాల్ లో ఉండే అటెండర్స్ తో మాట్లాడి ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పండని అడిగి డాక్టర్స్ కి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు తరువాత స్త్రీలు, పురుషుల విభాగాలను అక్కడ వున్న మూత్రశాలలను మంత్రి పరిశీలించి తగు సూచనలు చేశారు సరైన వైద్యం అందు తుందా లేదని డాక్టర్స్ మందులు సమయానికి ఇస్తున్నారా లేదా అని రోగులను అడిగి తెులుసు కున్నారు కొన్ని చోట్ల చెత్త డబ్బాల పై మూతలు లేక పోవడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు భావ నగర్ పై అంతస్తులో ఉన్న డెంగ్యూ పేషంట్స్ వద్దకు వెళ్లారు అందరికీ ఉచితంగా వైద్యం అందుతుందా అని రోగులను అడిగి తెలుసు కున్నారు అన్ని వార్డులు పరిస రాలలో శానిటేషన్ ఎపుడూ బాగుండాలని కేజీహెచ్ సూపరింటెండెంట్ డా.మైథిలికి ఆదేశించారు ఈసారి విజిట్ కి వచ్చినప్పుడు అన్నీ సక్రమంగా ఉండాలంటూ అధికారులను ఆదేశించారు ఈ తనిఖీ సమయం లో మంత్రితో పాటు కేజీహెచ్ సూపరింటెండెంట్ డా.మైథిలి, ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ బి.ఎ. నాయుడు,ఇతర వైద్యాధికారులు, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *