విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
ఇంద్రకీలాద్రి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీనివాస్ మహల్ సెంటర్ నందు జరిగిన అన్నదాన కార్యక్రమంలో ఎంఎస్ బేగ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయం లను ప్రతిబించేలా జరిపే ఈ పండుగలు మనలో ఐక్యమత్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు. అందరూ కలిసికట్టుగా సంతోషంగా గత 20 సంవత్సరం నుంచి వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొనడం చాలా ఆనందదాయకంగా ఉందని కొనియాడారు. అలాగే ఈ వినాయక చవితి ఉత్సవాలను జరిపిస్తున్న ఇంద్రకీలాద్రి ఫ్రెండ్స్ సర్కిల్ వారికి తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఇంతటి చక్కటి అన్నదాన కార్యక్రమంలో తనని పిలవడం, పాల్గొనేలా చేయడం చాలా ఆనందదాయకంగా ఉందని అన్నారు. గత మూడు సంవత్సరాల నుంచి కోవిడ్ నేపథ్యంలో చవితి ఉత్సవాలు జరిపించుకోలేకపోవడం చాలా బాధాకరంగా ఉందని అయితే ఆ వినాయకుడి దయవల్ల ఈ సంవత్సరం జరిపించుకోవడం చాలా ఆనందదాయకంగా ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దాడి మురళి ఇంద్రకీలాద్రి ఫ్రెండ్ సర్కిల్ సర్కిల్ పిల్ల శివ,రాజా రాము, ముజఫర్ బేగ్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …