జాతీయ రహదారి వెంబడి ఎయిర్ పోర్ట్ కారిడార్ డిజైన్ ప్రాజెక్ట్ నిర్మాణాల పరిశిలన…

-నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, సోమవారం ఏలూరు రోడ్డు, గుణదల సెంటర్ రోడ్డు లో జరుగుతున్న పారిశుధ్య నిర్వహణ విధానమును సంబందిత శానిటరీ ఇన్ స్పెక్టర్ ను అడిగి తెలుసుకున్నారు. డివిజన్ పరిధిలోని పలు వీధులలో పారిశుధ్యo మరియు అండర్ గ్రౌండ్ డ్రెయినేజి నిర్వహణ విధానమును పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. అదే విధంగా డివిజన్లో ఇంటింటి చెత్త సేకరణ విధానము మరియు డ్రెయిన్ నందు మురుగునీటి పారుదల తీరును పరిశీలిస్తూ, డ్రెయిన్లలో నీటి పారుదలకు అడ్డంగా ఉన్న చెత్త మరియు వ్యర్ధములను తొలగించాలని, పూర్తి స్థాయిలో నివాసాల నుండి చెత్త సేకరణ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు.

తదుపరి జాతీయ రహదారి రామవరప్పాడు రింగు నుంచి గన్నవరం ఎయిర్ పోర్ట్ కారిడార్ డిజైన్ ప్రాజెక్ట్ నిర్మాణాల పరిశిలన కోసం సోమవారం స్సెషల్ చీఫ్ సెక్రటరీ వై. శ్రీలక్ష్మి మరియు కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ అధికారులతో కలసి పరిశీలించారు.

ఎయిర్ పోర్ట్ కారిడార్ డిజైన్ ప్రాజెక్ట్‌ ముఖ్యమైన పాయింట్స్
1. ధృవీకరణ కోసం ఎయిర్‌పోర్ట్ కారిడార్ అంతటా ఆర్ట్ ఇన్‌స్టాలేషన్ సైట్‌లు సందర్శించబడ్డాయి.
2.రాష్ట్రవ్యాప్తంగా ఎయిర్‌పోర్ట్ కారిడార్ ఆర్ట్ ఇన్‌స్టలేషన్స్ డిజైన్‌ల కోసం త్వరలో డిజైన్ పోటీని నిర్వహించబోతున్నారు.
3. ఈ ఆర్ట్ ఇన్‌స్టాలేషన్‌లన్నీ ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల కళ మరియు సంస్కృతిని వర్ణిస్తాయి.

పర్యటనలో డిప్యూటీ సిటి ప్లానర్ (ప్లానింగ్ ) జుబిన్ శిరన్ రాయ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఏ.ఎస్.ఎన్ ప్రసాద్, మరియు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *