విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
సెంట్రల్ నియోజకవర్గo పరిధిలోని పలు అభివృద్ధి పనులకు శాసన సభ్యులు మల్లాది విష్ణు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, శాసన మండలి సభ్యులు యం.డి రహుల్లా, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శైలజ తో కలసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినారు. ఈరోజు 58వ డివిజన్ లోని దాదాపు 4కోట్ల వ్యయంతో 15వ ఫైనాన్స్ మరియు జనరల్ బడ్జెట్ నిధులతో నందమూరి నగర్ ఎక్స్ టెన్షన్ ఏరియాలో కొత్తగా నిర్మించు రిజర్వాయరుకు 400 ఎం.ఎం. డయా నీటి సరఫరా పంపింగ్ మెయిన్ లైన్ వేయుట మరియు తోట వారి వీధి 11వ రోడ్డు తూర్పు వైపున ఉన్న స్ట్రామ్ నీటి కాలువల ప్రాజెక్ట్ (L&T) మిగిలిపోయిన RCC డ్రైన్ గ్యాస్ కనెక్షన్ నిర్మాణం చేయు పనులకు శంఖుస్థాపన చేయడం జరిగినది. అదే విధంగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించుటలో నగరపాలక సంస్థ అనేక కోట్ల వ్యయంతో అభివృద్ధి కార్యక్రమములకు శంకుస్థాపన చేయుట జరిగిందని, పనులు సత్వరమే చేపట్టి వాటిని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటం జరుగుతుందని అన్నారు. స్థానిక శాసన సభ్యులు మల్లాది విష్ణు మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గo పరిధిలోని ఎన్నడు లేని అభివృద్ధి పనులు మా ప్రభుత్వం చేపట్టినట్లు సుదీర్ఘ కాలం కచ్చా రోడ్లతో కొత్తగా అభివృద్ధి చెందుతున్న అనేక కాలనీలు సైతం నేడు అభివృద్ధి పరచే విధంగా చర్యలు తీసుకోవటం జరుగుతుందని అన్నారు. నిరంతరo నియోజక వర్గంలో అభివృద్ధిని పర్యవేక్షిస్తూ, ముందుకు తీసుకువెళ్లటం అభినందనీయమని అన్నారు. పార్టీలకు అతీతంగా అన్ని ప్రాంతాలు అభివృద్ది చేయాలన్నదే మా ప్రభుత్వం ఉద్దేశం, అని పేర్కొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …