జిల్లాలో 500 పిఎంఎఫ్‌యంఇ యూనిట్లను స్థాపించడం లక్ష్యం…

-పిఎంఎఫ్‌యంఇ లబ్దిదారుల ఎంపిక మాసాంతానికి పూర్తి చేయండి…
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
సూక్ష్మ ఆహార తయారీ పరిశ్రమలను స్థాపించేందుకు ఔత్సాహికులైన లబ్దిదారులను గుర్తించి వారికి ఆర్థిక సహయాన్ని అందించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు సంబంధిత అధికారులను ఆదేశించారు.
జిల్లాలో ప్రధానమంత్రి ఫార్మలైజేషన్‌ ఆఫ్‌ మైక్రో క్రెడిట్‌ ఫుడ్‌ ఎంటర్‌ ప్రైజస్‌ (పిఎంఎఫ్‌యంఇ)పథకం అమలు పై సంబంధిత శాఖ అధికారులు బ్యాంకు అధికారులతో మంగళవారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలో ప్రధానమంత్రి ఫార్మలైజేషన్‌ ఆఫ్‌ మైక్రో క్రెడిట్‌ పుడ్‌ ఎంటర్‌ ప్రైజస్‌ పథకం ద్వారా సూక్ష్మ ఆహార తయారీ లబ్దిదారులను గుర్తించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని డిఆర్‌డిఏ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 500 మంది లబ్దిదారులకు ప్రధానమంత్రి ఫార్మలైజేషన్‌ ఆఫ్‌ మైక్రో క్రెడిట్‌ పుడ్‌ ఎంటర్‌ ప్రైజస్‌ పథకం కింద రుణాలను మంజూరు చేసి సూక్ష్మ ఆహార పరిశ్రమలను స్థాపించాలన్నది లక్ష్యం కాగా ఇప్పటివరకు 73 మంది లబ్దిదారులు ధరఖాస్తు చేసుకోగా వాటిలో 17 మంది లబ్దిదారులకు పథకం మంజూరు చేయడం జరిగిందన్నారు. స్థాపించే ప్రాజెక్టు వ్యయంలో 10 శాతం లబ్దిదారుడు పెట్టుబడి పెడితే 90 శాతం బ్యాంకుల నుండి రుణ సాయం అందించడం జరుగుతుందని ఇందులో 35 శాతం ప్రభుత్వం సబ్సిడీ గా చెల్లిస్తుందని కలెక్టర్‌ అన్నారు. మిగిలిన ధరఖాస్తులను బ్యాంకు అధికారులు వివిధ కారణాలతో తిరస్కరించడం జరిగిందన్నారు. బ్యాంకు అధికారులు ధరఖాస్తులు తిరస్కరించడానికి గల కారణాలను నిశితంగా పరిశీలించి వాటిని నివృత్తి చేసి తిరిగి రుణమంజూరుకై బ్యాంకులకు సమర్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ధరఖాస్తులతో పాటు నూతన ధరఖాస్తులను స్వీకరించేందుకు ఔత్సాహిక లబ్దిదారుల ఎంపికను సెప్టెంబర్‌ మాసాంతానికి పూర్తి చేయాలన్నారు. ధరఖాస్తు దారులలో అర్హులైన వారికి అక్టోబర్‌ మాసంలో బ్యాంకుల ద్వారా రుణాలను మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. లబ్దిదారులకు వారు తయారు చేసే ఉత్పత్తులకు ప్యాకింగ్‌ బ్రాండిరగ్‌ మార్కెటింగ్‌ వంటి తదితర అంశాలపై శిక్షణ అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు.

లబ్దిదారులతో నేరుగా ఫోన్‌లో సంభాషించిన జిల్లా కలెక్టర్‌ :
ప్రధానమంత్రి ఫార్మలైజేషన్‌ ఆఫ్‌ మైక్రో క్రెడిట్‌ పుడ్‌ ఎంటర్‌ ప్రైజస్‌ పథకం ద్వారా విజయవాడ నగరంలోని సత్యనారాయణపురంలో శ్రీనిధి న్యూట్రిషియన్‌ ఫుడ్స్‌ పరిశ్రమను స్థాపించి లాభాల బాటలో వ్యాపారాన్ని నిర్వహిస్తున్న గూడూరు శ్రీపావనితో సమావేశం నుండి నేరుగా వీడియోకాల్‌ ద్వారా జిల్లా కలెక్టర్‌ మాట్లాడి ఆమెకు పథకం ఏ విధంగా మంజూరు అయినది వ్యాపారం స్థాపించి లాభాలను ఎలా పొందుతున్నది అడిగి తెలుసుకున్నారు. శ్రీనిధి న్యూట్రిషియన్‌ ఫుడ్స్‌ అధినేత పావని మాట్లాడుతూ తనకు ప్రధానమంత్రి ఫార్మలైజేషన్‌ ఆఫ్‌ మైక్రో క్రెడిట్‌ పుడ్‌ ఎంటర్‌ ప్రైజస్‌ పథకం ద్వారా 3.50 లక్షల రూపాయల రుణం మంజూరు కాగా ఇందులో 1లక్ష 22 వేల రూపాయలు ప్రభుత్వ సబ్సిడీ ద్వారా అందజేశారన్నారు. తాను రుణం తీసుకున్న రుణంతో వ్యాపారాన్ని చేపట్టి 4 సంవత్సరాలు అయిందని తెలిపారు. తాను తయారీ చేసే ఉత్పత్తులలో నాణ్యత ప్రమాణాలతో తయారీ చేసి శ్రీనిధి ఫుడ్స్‌ బ్రాండ్‌పై మార్కెటింగ్‌ చేస్తున్ననని వినియోగదారులు తన పరిశ్రమ వద్దకు వచ్చి కొనుగోలు చేస్తున్నారన్నారు. గతంలో రోజుకు 3 వేల రూపాయల అమ్మకాలు నిర్వహించేవరమని ప్రస్తుతం 15వేల అమ్మకాలు నిర్వహిస్తూ పలువురికి ఉపాధి కల్పిస్తున్నట్లు కలెక్టర్‌కి వివరించారు.
శ్రీనిధి అధినేత పావనిని స్పూర్తిగా తీసుకుని వ్యాపార అనుభవాలను గడిరచి సూక్ష్మ ఆహార తయారీ పరిశ్రమలను స్థాపించుకునేందుకు ముందుకు వచ్చే ఔత్సాహికులకు రుణాలు అందించేందుకు బ్యాంక్‌ అధికారులు ముందుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని లీడ్‌ బ్యాంక్‌ అధికారికి సూచించారు.
సమావేశంలో ఏపిఎఫ్‌పియస్‌ జోనల్‌ మేనేజర్‌ ఎస్‌ ఎన్‌ మణికంఠరెడ్డి, సెర్ఫ్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ సరళ, ఎల్‌డియం కోటేశ్వరరావు, డిఆర్‌డిఏ పిడి ఎన్‌ కిరణ్‌కుమార్‌, ఉద్యాన శాఖ అధికారి పి బాలాజీ కుమార్‌, సోషల్‌ వెల్ఫెర్‌, బిసి వెల్ఫెర్‌, ట్రైబల్‌ వెల్ఫెర్‌ అధికారులు, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు

-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *